శోభానాగిరెడ్డి స్థానానికి కొండా ఎసరు

శోభానాగిరెడ్డి స్థానానికి కొండా ఎసరు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయమ్మ వెనకాల నీడలా కనిపిస్తూ.. మీడియాలోనూ తరచూ కనిపించే ఈమెను గుర్తు పట్టారా? ఆ.. ఆవిడే శోభానాగిరెడ్డి. కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే.  ఫ్యాక్షనిస్టు ముద్ర ఉన్న మాజీ ఎంపీ భూమానాగిరెడ్డి భార్య. వీరంతా ఒకప్పుడు టీడీపీలో ఉండేవారు. చేతిలో పవర్ లేకపోతే ఉక్కిరిబిక్కిరి అవుతారు. అలా.. టీడీపీ నుంచి దూరమై ప్రజారాజ్యం పార్టీ(అదేనండి మన చిరంజీవి పెట్టిన పార్టీ) అధికారంలోకి వచ్చేస్తుందని అందులోకి జంప్ అయ్యారు. కానీ.. వారి ఆశలు తీరకపోవటంతో ఇప్పుడెలా అనుకుంటున్న సమయంలోనే జగన్ బాబు పార్టీ పెట్టటంతో వారు..  ప్రజారాజ్యం నుంచి అర్జెంట్ గా జగన్ పార్టీలోకి షిప్ట్ అయిపోయారు.

ఒక్కొక్క అడుగు వేస్తూ... మొత్తానికి విజయమ్మకు దగ్గరయ్యారు. అప్పటివరకూ యమా ఫాస్ట్ గా ఉంటూ దూసుకుపోయే కొండా సరేఖ అక్క... ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమి, ప్లస్ మిగిలిన విషయాలతో పార్టీ నుంచి కాస్త సైడ్ అవటంతో శోభకు ఎదురే లేకుండా పోయింది. తాజాగా జగన్ బాబుతో కొండా దంపతులు ములాఖాత్ అవ్వటం.. లెక్కలు సెటిల్ అవ్వటంతో... తాము ఇక నుంచి పార్టీలో యాక్టివ్ గా ముందుకు సాగుతామని కొండా సురేఖ చెప్పారు. అందుకు తగ్గట్లే తన ప్రయత్నాలు మొదలుపెట్టటంతో శోభ స్థానం చిక్కుల్లో పడింది. నిన్నటివరకూ పార్టీలో విజయమ్మ తర్వాత తనదే హవా అనుకుంటూ తిరిగే శోభకు కొండా సురేఖ  రీ ఎంట్రీ విపరీతమైన ఇబ్బందిని కలిగిస్తుంది. రాజకీయాల్లో ఎవరి స్థానం శాశ్వితం కాదని ఇప్పటికీ తెలుసుకోలేదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English