పవన్‌ పరువు ఉంటుందా,, పోతుందా?

పవన్‌ పరువు ఉంటుందా,, పోతుందా?

 సీమాంధ్రలో ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. ఇక ఓటరు తీర్పు మిగిలింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన పవన్‌కళ్యాణ్‌ తను మద్దతు ఇచ్చిన కూటమికి ఎంతవరకు దోహదపడ్డాడనేది తెలుసుకోవాలని అతని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణలో ఎన్డీయే పోటీ ఇచ్చిందనిపిస్తే పాస్‌ అయిపోయినట్టే. కానీ సీమాంధ్రలో పరిస్థితి అది కాదు. అక్కడ ఖచ్చితంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు విజయం సాధిస్తేనే పవన్‌ ఎఫెక్ట్‌ ఉన్నట్టు. జగన్‌ని అధికారంలోకి రాకుండా పవన్‌ పవర్‌ ఎంతవరకు పని చేసిందనేది కీలకం.

ఈసారి పవన్‌ ప్రభావం చూపలేదని అనిపిస్తే వచ్చే ఎన్నికలకి అతడిని రాజకీయంగా సీరియస్‌గా తీసుకునే ఛాన్స్‌ లేదు. వచ్చేసారి సొంత పార్టీ తరఫున సొంతంగా ఎన్నికల బరిలో దిగాలంటే పవన్‌ ఈసారి తన సత్తా చాటి తీరాలి. అప్పుడే అతడిని అందరూ సీరియస్‌గా తీసుకుంటారు. ముఖ్యంగా అన్నకి ఎదురు నిలిచి, మెగా ఫాన్స్‌ ద్వేషించే పార్టీకి మద్దతిచ్చి... పవర్‌ఫుల్‌ స్పీచ్‌లతో అదరగొట్టిన పవన్‌ ఇదంతా ఓట్లుగా కన్వర్ట్‌ చేసుకోవాలి. లేని పక్షంలో అతని పరువు పోవడమే కాకుండా ఇప్పటికే పవన్‌పై నిప్పులు చెరుగుతోన్న మీడియా వర్గం అతడిని ఎండగట్టేస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు