విజయసాయిరెడ్డికి టైమ్ అయిపోయింది!

విజయసాయిరెడ్డికి టైమ్ అయిపోయింది!

వెంకటేశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి వెళుతూ ప్రశాంతంగా ఆ పనేదో పూర్తి చేసుకోకుండా రాజకీయాల గురించి మాట్లాడటానికే ప్రాధాన్యత ఇచ్చిన సాక్షి ఆడిటర్, జగన్ కేసులో నిందితుడు విజయసాయిరెడ్డికి బయట తిరిగే అవకాశం ఈ రోజు రేపటితో పూర్తవుతుంది! అంతగా రాజకీయాల గురించి మాట్లాడాలని అనిపిస్తే ఒకసారి ఇంటి దగ్గరకు విలేకరులను పిలిపించుకుని మాట్లాడాల్సింది. కానీ ఈయన తిరుమలకు వెళ్లే దారిలో అయితేనే బాగుంటుందన్నట్టుగా అతి చేశారు. ఆ సంగతి అలా ఉంటే... విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడానికి టైమొచ్చింది.

జగన్ కేసులో చాలా రోజుల కిందటే బెయిలు పొందిన విజయసాయి కొన్ని రోజులుగా బయటే ఉన్నారు. దీనిపై సీబీఐ వేసిన పిటిషన్ కు సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందిస్తూ.. బెయిలు రద్దు చేసింది. కూతురు వివాహం ఉందని సాయిరెడ్డి పెట్టుకున్న విజ్ఙప్తిని మన్నిస్తూ జూన్ ఐదో తేదీలోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. కూతురు వివాహం అయిపోవడంతో ఇప్పుడు సాయిరెడ్డి జైలుకు వెళ్లడమే మిగిలింది. ఆ సమయమూ దగ్గరపడుతోంది. జగన్ సాయంతో రాజకీయాల్లోకి రావడానికి ఉబలాపడుతున్న విజయసాయిరెడ్డి అందుకు తగ్గట్టుగా మొన్న భారీ రాజకీయ ప్రసంగం చేశాడు. చంద్రబాబును, సీబీఐను కలిసి విమర్శించాడు. అయితే ఎంత గొప్సగా మాట్లాడగలిగినా...ఇప్పుడు ఆయన చేయగలిగినది ఏమీలేదు. ఇక ఊచలు లెక్కపెడుతూ... మళ్లీ బెయిలు ప్రయత్నాలు చేసుకోవడమే! అయితే ఈ సారి గతంలో దొరికినంత సులభంగా బెయిలు దొరక్కపోవచ్చు కూడా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు