డీఎల్ ను పంపేందుకు 3 నెలల కసరత్తు

డీఎల్ ను పంపేందుకు 3 నెలల కసరత్తు

వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం.  ఇప్పుడు మాజీ మంత్రి అయిన డీఎల్ రవీంద్రారెడ్డిని ఇంటికి పంపించటం కోసం ముఖ్యమంత్రి మూడు నెలలకు పైగా సమయం తీసుకున్నారట. డీఎల్ వైఖరిపై అధిష్ఠాటానికి సీఎం విన్నవించటం.. దానికి సానుకూలంగా స్పందించటం ఎప్పుడో జరిగిపోయిందట. కాకపోతే.. తదనంతర పరిణామాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి.. రాగల విపరిణామాల గురించి అవగాహన వచ్చాకే ఆయనీ నిర్ణయం తీసుకున్నారని సీఎం సన్నిహితులు చెబుతున్నారు. వాస్తవానికి కిరణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని.. ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సానుకూల వర్గం చాలా తక్కువన్న విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

‘సీఎం చాలా ఓపిక పట్టారు. కానీ ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక కూడా ఆయన మూడు నెలల ఊరుకున్నారంటే ఆలోచించండి. నిజానికి కిరణ్ కు దూకుడు ఎక్కువని చెబుతారు కానీ.. డీఎల్ వ్యవహారం చూసినప్పుడు ఆయనకంటే కూడా అధిష్ఠానం చాలా దూకుడుగా ఉంది’’ అని సీఎం సన్నిహితులు చెప్పుకొచ్చాచు. కాకపోతే.. ఎంతకీ దారిలోకి రాకపోయేసరికి... డీఎల్ ను ఇబ్బందికరంగా పంపినట్లుగా వారు చెబుతున్నారు. ఇక్కడ డీఎల్ ను అవమానించే కన్నా కూడా.. దారికి రాని మంత్రులను తన దారిలోకి తెచ్చుకునేందుకే అంత కఠినంగా వ్యవహరించారన్నది వారి ఉవాచ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు