ఈసారి ఎన్టీఆర్ కోటా ఉందా? లేదా?

ఈసారి ఎన్టీఆర్ కోటా ఉందా? లేదా?

పార్టీలు అన్నాక టికెట్ల కేటాయింపులో ముఖ్యమైన నాయకులకు కాస్త ప్రాధాన్యత వుండడం సహజం. పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర వహించే నాయకులు తమ తమ అనునాయులకో, లేదా తమ వారికో ఒకటి రెండు సీట్లు కేటాయించుకోవడం సహజం. అలాగే కులాల వారీగా కూడా కేటాయింపులు వుంటాయి. తెలుగుదేశం బిసిలకు వంద సీట్లు అంది ఆ మాదిరిగా అన్నమాట,. ఇదంతా బాగానేవున్నా పాపం తెలుగుదేశం పార్టీలో, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కోటా మాత్రం పెరగడం లేదు. ఆయన బతికి వున్న రోజుల్లో ఇద్దరు అల్లుళ్లు, కొడుకు ఆయన కోటా కిందకే వచ్చేవారు. అంటే ఆయన సీటుతో కలిపి ఎన్టీఆర్ కోటా నాలుగు సీట్లన్నమాట. ఆయన పోయి, పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చాక, ఎన్టీఆర్ కోటా పూర్తిగా చిక్కిపోయింది. కేవలం ఒక్కరికే అవకాశం దక్కింది. అది హరికృష్ణ రూపంలో. మరోకరు ఎవరికీ అవకాశం లేదు. పోనీ ఆసక్తి లేదా అంటే ఇవ్వాలే కానీ తారకరత్న రెడీ.

గత ఎన్నికల నుంచి బాలకృష్ణ పేరు వినిపిస్తూనే వుంది. ఈ సారి కూడా హరికృష్ణ, బాలకృష్ణ పేర్లు వినిపించాయి. కానీ టిక్కెట్లు ఇస్తారా ఇవ్వరా అన్నది అనుమానంగానే వుంది. నిన్నటి దాకా బాలకృష్ణ అవకాశం వచ్చినపుడల్లా, పోటీకి సై,. ఆపై స్థానం అన్నది బావ ఇష్టం అని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ అభిమానులు ఓ అడుగు ముందుకు వేసి, ఆయనకు సరియైన పదవి ఇవ్వకుంటే, పార్టీని వ్యతిరేకిస్తామని అల్టిమేటమ్ ఇచ్చారు. తీరా తాజాగా, బాలకృష్ణ తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. పార్టీ ఆదేశిస్తే, ఆలోచిస్తామన్నారు. బాలకృష్ణ ఇలా ఉన్నట్లుండి మాట మార్చడం వెనుక ఏమై వుంటుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. నిన్నటికి నిన్న చంద్రబాబుతో సమావశమైతే, విషయం ఏదో వుందనుకున్నారు. కానీ ఈ రోజు ఇలా మాట మార్చేసరికి ఏమై వుంటుంది అన్న అనుమానాలు మొదలయ్యాయి. హరికృష్ణ కూడా టికెట్ ఆశిస్తున్నందున, ఆయనకు ఇచ్చి, ఈయనను వదిలేసారా? లేక ఇద్దర్నీ వదిలేసారా? అన్నది అనుమానం. అలా అయితే ఎన్టీఆర్ కోటా మరి లేనట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు