డబ్బులు ఉన్న వారిపైనే కేసీఆర్ కన్ను

డబ్బులు ఉన్న వారిపైనే కేసీఆర్  కన్ను

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన రూటు మార్చారా? అంటే అవుననే చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ తెలంగాణ ప్రజల్లో అంతో ఇంతో పట్టు ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన ఇప్పడు ఆ వ్యూహాన్ని మార్చారు. ఎన్నికల్లో ఖర్చు చేయటానికి వెనకాడకుండా ఉండే వారిని ఆయన వెతుకుతున్నారు. అలాంటి వారికే పెద్ద పీట వేసేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు తాజా నిదర్శనమే.. నిజాం కాలేజీలో ఏర్పాటు చేసిన సభే. పార్టీలో చేరిన వారిలో అత్యధికులు బాగా ‘సౌండ్’ ఉన్న వారే. ఉదాహరణకు మర్రి జనార్థన్ రెడ్డి వస్త్రవ్యాపరంలో పేరున్న ఈయన దగ్గర డబ్బుకు కొదవ లేదు. అదే విధంగా తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ నేత బూర నర్సయ్య గౌడ్, ఈయన ఒక్కరే పార్టీకి అవసరమైతే ఇరవై కోట్ల రూపాయిల వరకు ఇచ్చేందుకు రెఢీ అంటున్నారట.

మరో నేత బడా కాంట్రాక్టర్ అయిన సుధాకర్ రెడ్డి.. ఈయన అయితే మహా ఫాస్ట్ గా ఉన్నారట. డబ్బు గురించి మాట్లాడొద్దు. ఎంత కావాలో మాత్రమే చెప్పండి అంటున్నాడట. పార్టీలో చేరుతున్నారు కదా పార్టీ ఫండ్ ఏమైనా అంటూ నసుగుతున్న టీఆర్ఎస్ నేతలతో... ఓ 25కోట్ల రూపాయిలు సరిపోతాయా? అన్నట్లుగా పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. పార్టీలో వచ్చే లీడర్లకు జనాల్లో పట్టు ఉన్నా లేకున్నా సరే... డబ్బులు ఫుల్లుగా ఉంటే చాలన్న భావనకు పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపుతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి... తాజాగా వస్తున్న నేతలతో పార్టీ... ధనలక్ష్మి కళతో కళకళలాడిపోతుందని చెబుతున్నారు.

 

TAGS

TRS KCR

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు