ఈడీ అధీనంలోకి జగన్ రాజసౌధాలు

ఈడీ అధీనంలోకి జగన్ రాజసౌధాలు

జగన్ వర్గానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇవ్వబోతుందా? అంటే.. అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. వాన్ పిక్ వ్యవహారంలో జగన్, నిమ్మగడ్డకు చెందిన బ్యాంక్ అకౌంట్లను ఈడీ సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వారి దృష్టి జగన్ స్థిర, చర ఆస్తులపై పడినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్, బెంగళూరులోని భారీ రాజసౌధంతో సాక్షి కార్యాలయ భవనాన్ని కూడా జఫ్తు చేసేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. జగన్ తో పాటు వాన్ పిక్ వ్యవహారంలో మరో నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన 1500 కోట్ల రూపాయిల ఆస్తులపై కూడా ఇదే విధానాన్ని అనుసరించనున్నారు. ఒక కేసులో ఇంత భారీ ఎత్తున ఆస్తులను జుఫ్తు చేయటం ఈడీ చరిత్రలో ఇదే ప్రధమంగా చెప్పొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు