తెలంగాణ తొలి సీఎం పేరును చెప్పిన బాబు

తెలంగాణ తొలి సీఎం పేరును చెప్పిన బాబు

తెలంగాణపై తనకున్న స్పష్టత గురించి తెలుగుదేశం పార్టీ మరోసారి వ్యక్తం చేసింది. టీఆర్ఎస్ తన విషపు ప్రచారం కొనసాగిస్తున్నా.. తెలంగాణ ఏర్పాటుపై తమ పార్టీకి ఉన్న కమిట్ మెంట్ గురించి చంద్రబాబునాయుడు చెప్పకనే చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డాక దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామని పేర్కొన్నారు. మోత్కుపల్లి నర్సింహులు కానీ కె.ఎస్.రత్నంలలో ఎవరో ఒకరిని తెలంగాణ సీఎంగా చేస్తామని తనకు చెప్పినట్లు ఐకాస ఛైర్మన్ గజ్జెల కాంతం పేర్కొన్నారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామని కూడా ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణపై తొలి తీర్మానం చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు కాంతం చెప్పారు. తెలంగాణపై మాటలతో కాదు చేతల్లో చూపిస్తామన్నట్లుగా చంద్రబాబు మహాదూకుడుగా ముందుకు సాగుతున్నారు. తాను చంద్రబాబును కలవటానికి కారణాన్ని చెబుతూ.. టీఆర్ఎస్ నేత హరీష్ రావు తమ పార్టీని టీడీపీలో విలీనం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినందుకే వచ్చామని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రిగా టీడీపీ అభ్యర్థి ఎవరో స్పష్టమైనట్లే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు