బాబు దయపై పురంధ్రీశ్వరి భవిత

బాబు దయపై పురంధ్రీశ్వరి భవిత

ఇంత బతుకు బతికి, ఇంటి వెనకాల పడి వుండడం అంటే అదేనేమో? ఉన్నట్లుండి రాజకీయాల్లోకి వచ్చి, మరిది చంద్రబాబును కాదని, కాంగ్రెస్ లో అడుగిడి, మంత్రి పదవి సంపాదించింది ఎన్టీఆర్ తనయ పురంధ్రీశ్వరి. పదవీ వైభోగం వెలగబెట్టి, రాహుల్ కొటరీ మనిషి అనిపించుకుని, ఆపై అవసరం తీరిపోయాక భాజపాలోకి జంప్ జిలానీ అనేసింది. అంతవరకు సీను బాగానే వుంది. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ పోటీ చేద్దామనుకుంటే మాత్రం మళ్లీ మరిది చంద్రబాబు దయ కావాల్సి వస్తోంది. భాజపాతో పొత్తులో బాబు దయతలిచి విశాఖ, విజయవాడ వదిల్తేనే, ఆమెకు అవకాశం దక్కేది. ఆ రెండూ ఇవ్వనంటున్నారు బాబుగారు. ఈ రెండు తప్పితే, ఇంకెక్కడా పోటీ చేసేంత సీను లేదు అమ్మగారికి. పోయి పోయి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి తప్పితే. కానీ భాజపా ఆమెకు ఎంపీ, ఆమె తనయుడికి ఎమ్మెల్యే అంటూ రెండు టిక్కెట్లకు హామీ ఇచ్చింది. హామీ ఇచ్చింది భాజపా అయినా, నెరవేరాలంటే బాబు కరుణ కావాల్సిందే. మరి చంద్రబాబు పాత పగలు మరిచి కరుణిస్తారో, కరుణించరో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు