విశాఖ నుంచి షర్మిల ఫైనల్

విశాఖ నుంచి షర్మిల ఫైనల్

విశాఖ పార్లమెంటు స్థానం అతివల నడుమ రసవత్తర పోరుగా మారబోతోంది. జగన్ సోదరి షర్మిల విశాఖ నుంచి వైకాపా అభ్యర్థినిగా రంగంలోకి దిగుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అక్కడి అభ్యర్థి విషయంలో పునరాలోచనలో పడింది. ఇప్పటిదాకా అక్కడ గంటా శ్రీనివాసరావు పోటీలో వుంటారని భావిస్తున్నారు. వైకాపా తరపున వైవి సుబ్బారెడ్డి రంగంలోకి వస్తారనుకున్నారు. కానీ సుబ్బారెడ్డి విశాఖకు వెళ్లడానికి ససేమిరా అనడంతో షర్మిల కోరిక నెరవేరింది. దీంతో ఇప్పుడు తెలుగుదేశం తరపున సరియైన మహిళ ఎవరు అన్నది సమస్యగా మారింది. పైగా భాజపా పురంధ్రీశ్వరి కోసం విశాఖను కోరుతోంది. అందుకే ఈ సీటును వదులుకోని గంటాను అనకాపల్లి ఎంపీ స్థానానికి కానీ, శాసనసభకు కానీ పోటీ చేయించాలని ఆలోచిస్తోంది. మొత్తానికి విశాఖ స్థానం ఇద్దరు మహానేతల తనయిల నడుమ పోరుకు కేంద్రంగా మారనుంది

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు