త్వరలో ఎన్టీఆర్-బాబు భేటీ?

 త్వరలో ఎన్టీఆర్-బాబు భేటీ?

నందమూరి అభిమానులు సంతసించే విషయమే. కాస్త ఎడమొహం.పెడమొహంగా వున్న మామా అల్లుళ్లు, చంద్రబాబు-ఎన్టీఆర్ త్వరలో సమావేశం కానున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాల బోగట్టా. ఎన్నికల దగ్గరకు వచ్చిన తరువాత, ఈ సమావేశం జరుగుతుందని, ఎన్టీఆర్ బాహాటంగా తన మద్దతును తెలుగుదేశానికి మరోసారి ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సమాచారాని బాబుకు అందించారని అంటున్నారు. జూనియర్ కు ఎప్పుడూ ఆహ్వానం వుంటుందని బాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలుగుదేశం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వైనం ఎంతవరకు నిజం అన్నది పక్కన పెడితే, ఇక ఈ దారి తొక్కకుండా వుండలేని పరిస్థితి ఎన్టీఆర్ ది. సరియైన సినిమాలు లేకపోవడం, చేతిలో వున్న సినిమాలు ముందుకు సాగకపోవడం, సినిమా రంగంలోని ప్రముఖులు మోడీ, బాబుకు మద్దతు పలుకుతుండడం, తండ్రి హరికృష్ణ, మామ శ్రీనివాసరావు కూడా మళ్లీ బాబు చెంతకే చేరడం, ఇవన్నీ జూనియర్ ను కూడా అదే బాటలో నడిచేలా చేస్తున్నాయి. ​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు