తికమక పెట్టి చంపుతున్న పవన్‌కళ్యాణ్‌

తికమక పెట్టి చంపుతున్న పవన్‌కళ్యాణ్‌

 పవన్‌కళ్యాణ్‌ అసలు రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడో, ఎందుకని ఆ రోజు అంతగా గొంతు చించుకున్నాడో, తన పార్టీ విధి విధానాలేంటో, అన్నిటికీ మించి ఈసారి ఎన్నికల్లో తన పార్టీ పనేంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పవన్‌ ఫలానా పార్టీతో పొత్తు పెట్టుకుంటాడనే వార్తలు వస్తుంటే అదేదో సరాసరి ఆ పార్టీ సభ్యత్వమే తీసుకోక పార్టీ ఎందుకు పెట్టినట్టు అని జనం తల గోక్కుంటున్నారు. అసలు ఈ ఎన్నికల్లో పవన్‌ పోటీయే చేయడనే టాక్‌ కూడా బాగా వినిపిస్తోంది. మరి ఇంత ఆదరాబాదరాగా పార్టీ ఎందుకు లాంఛ్‌ చేసాడో, రేపు వైజాగ్‌లో భారీ బహిరంగ సభ ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు.

పార్టీ అనౌన్స్‌ చేసిన దగ్గర్నుంచి మోడీని కలిసినప్పుడు మినహా పవన్‌ బయటకి రాలేదు. మీడియాని కలవలేదు. రేపు వైజాగ్‌ సభ వరకు అతను కొత్తగా చేసేదేమీ ఉండదు. ఆ సభ తర్వాత ఏం చేస్తాడో, ఎన్నికల ప్రచారంలో తన పాత్ర ఏంటో... తనని జనం సీరియస్‌గా తీసుకోవాలో లేక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీకిది ప్రచార చిత్రం అనుకోవాలో ఏమీ తెలీడం లేదు. పవన్‌కళ్యాణ్‌ ఒక ప్రణాళిక లేకుండా తన ఆలోచనల్ని అమల్లో పెడతాడనే చెడ్డ పేరుండేది. చూస్తుంటే జన సేన కూడా అలా పుట్టుకొచ్చిందే అనిపిస్తోంది. తన పార్టీ ప్రచారానికి వాడుతున్న ట్రెయిలర్లు కూడా మరీ ఎడ్యుకేటెడ్‌ సెక్షన్‌ని తప్ప మామూలోళ్లకి అర్థమయ్యేట్టు లేవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English