బిందాస్ గా ముఖ్యమంత్రి

బిందాస్ గా ముఖ్యమంత్రి

ముభావంగా కనిపించే ముఖ్యమంత్రి ఇవాళ చాలా ఉల్లాసంగా కనిపించారట. మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేసి ఒక్కరోజు కూడా కాకుండానే సీఎంలో ఎంత మార్పు అని ఆయన సన్నిహితులు ఆశ్చర్యపోతున్నారట. ముఖ్యమంత్రి కాక ముందు నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక అలవాటు ఉంది. జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్కుకు పొద్దున్నే వాకింగ్ చేయటం. ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆ వ్యాపకాని కాస్త పక్కన పడేశారనే చెప్పాలి. ఒకవేళ వచ్చినా...సెక్యూరిటీ హంగా.. అట్టహాసం గురించి తెలిసిందే.


అయితే... డీఎల్ ను బర్తరఫ్ చేసిన తెల్లారే... ఎలాంటి సెక్యూరిటీ హడావుడి లేకుండా ఒక్కరే ప్రశాంతంగా కేబీఆర్ పార్కులో వాకింగ్ చేశారట. ఆ సమయంలో ఆయన చాలా ప్రశాంతంగా.. హుషారుగా ఉన్నారని చెబుతున్నారు. డీఎల్ లాంటి పెద్ద వికెట్ ని అలవోకగా క్లీన్ బౌల్డ చేసినప్పుడు... స్వతహాగా మంచి క్రికెటర్ అయిన ముఖ్యమంత్రికి ఆనందం ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పుడు ఆయనకు కాంగ్రెస్ లో అడ్డుపడేవారెవరున్నారు. అప్పడప్పుడు చెప్పు కింద రాయిలా ఇబ్బంది పెట్టే  పీసీసీ చీఫ్ బొత్స సత్తిబాబు సైతం డీఎల్ విషయంపై ముక్తసరిగా మాట్లాడి ముగించేశారు. తాజా పరిణామాలతో సీఎం బిందాస్ గా ఉన్నారనే చెప్పాలి.


 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English