అసలు విషయం చెప్పేసిన మందా

అసలు విషయం చెప్పేసిన మందా

ఏదైనా అంతే.. తమ దాకా వచ్చేసరికి తత్వం బోధపడుతుంది. నచ్చినప్పుడు దేవతగా కనిపించినోళ్లే... తేడా వస్తే వాళ్లే దెయ్యంలా కనిపించటం మామూలే. అందరిలాంటి వారే కదా మందా జగన్నాథం కూడా. కాంగ్రెస్  నుంచి టీఆర్ఎస్ లోకి వెళుతున్న ఈ ఎంపీకి ఇప్పుడు ఒక్కసారి వాస్తవాలు గుర్తుకు వచ్చాయి. పదవుల కోసమే పార్టీకి రాజీనామా చేసి పోతున్నారంటూ ఓపక్క... కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే మందా ముందుచూపుతో చేసిన వ్యవహారంగా తాజా జంపింగ్ గురించి కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.


 తన గురించి ఏమైనా అంటే ఊరుకుండే వాడేమో కానీ.. విషయంలోకి తన కొడుకు ప్రస్తావన రాగానే మందాలోని మరో మనిషి నిద్ర లేచాడు. తనను విమర్శిస్తున్న వారిపై ఇంతెత్తు ఎగిరారు. మర్చిపోయారా.. నెహ్రూ, ఇందిర, రాజీవ్, రాహుల్.. ఇలా గాంధీ కుటుంబం నుంచి వారసులు రాజకీయాల్లోకి రాగా లేంది.. మా పిల్లలు పాలిటిక్స్ లోకి వస్తే తప్పా అని నిలదీశారు. తమ పిల్లలు పోటీ చేస్తారని.. ప్యాకేజీలని దుష్ర్పచారం చేస్తున్నారని మండి పడ్డారు.


 అయినా మందా పిల్లోడు పోటీ చేస్తాడనగానే ప్యాకేజీలంటారా? అంటూ చెప్పకనే అసలు విషయాన్ని మందా బయటకు చెప్పేశారు. మొత్తానికి కొడుకు రాజకీయ భవిష్యత్తు  కోసం గాంధీ కుటుంబం మీద విరుచుకుపడటంలో తప్పేముంది.  ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. జగన్నాథం పుత్రరత్నం శ్రీనాద్  మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు