ఓట్లు, సీట్లతోనే తెలంగాణ సాధ్యం

ఓట్లు, సీట్లతోనే తెలంగాణ సాధ్యం

ఉద్యమ పంధాలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని గద్దర్‌ లాంటివారు అంటారు. ఉద్యమానికి రాజకీయ బలం తోడైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సులువని టిఆర్‌ఎస్‌ భావన. వివిధ రాజకీయ పార్టీలూ అలానే అంటాయి. అది నిజం కూడాను. కాని, రాజకీయాలు అంత క్లీన్‌గా లేవు. ఒక్కసారి ఓట్లు, సీట్ల కోసం ఆలోచిస్తే ఉద్యమం పక్కదారి పడుతుంది. ఇది జగమెరిగిన వాస్తవం. ఇదిలా ఉండగా, ఎన్నికల ద్వారానే తెలంగాణ సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీని వీడిన ఎంపీ వివేక్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌, కేకేల ద్వారానే తెలంగాణ రాదని, అందరినీ కలుపుపోవాలని అభిప్రాయపడ్డారు. పార్టీలో చేరేవారికి సీట్లిస్తే తప్పేంటని వివేక్‌ ప్రశ్నించారు. తెలంగాణ కోసం అందరినీ కలుపుకోవాలని కేసీఆర్‌కు కూడా సూచిస్తానని ఆయన తెలిపారు.

కాంగ్రెస్‌ మోసం చేసినందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానన్నారాయన. దళితులనే తమని అవమానపరుస్తున్నాని, కావూరికి ఇచ్చిన గౌరవాన్ని తమకు ఇవ్వడం లేదన్నారు. తన వ్యాపారాలపై ముఖ్యమంత్రి అప్పుడే దాడులు చేయిస్తున్నారని వివేక్‌ ఆరోపణలు చేశారు. ఏదేమైనా కేవలం ఓట్లు సీట్లతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదు. వివేక్‌ మాటలు చూస్తే ఆయన రాజకీయ ఆలోచన తప్ప ఉద్యమ కార్యాచరణ గురించి ఆలోచిస్తున్నట్టు అనిపించడంలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు