పొలిటికల్‌ కరెప్షన్‌ బుకీ జగన్‌

పొలిటికల్‌ కరెప్షన్‌ బుకీ జగన్‌

వైకాపా అధినేత జగన్‌ మోహన్‌రెడ్డిపై కాంగ్రెసు వారు విమర్శలు చేయడం కొత్త కాదు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆర్థిక తీవ్రవాది అని జగన్‌ని విమర్శించడం జరిగింది. అది చాలా వివాదాలకూ కారణమయ్యింది.  ఇప్పుడు తాజాగా జగన్‌ రాజకీయ అవినీతి బుకీ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అభివర్ణించారు.

ఐపీఎల్‌లో ఇప్పుడు బెట్టింగ్‌లు వెలుగు చూస్తే రాష్ట్రంలో పదేళ్ల కిందటే రాజకీయ అవినీతి జరిగిందని.. అందుకు బుకీ జగన్‌ అయితే విజయసాయిరెడ్డి బ్రోకర్‌ అని ఘాటైన విమర్శలు చేశారయన. జగన్‌ పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కాదని.. వైఎస్‌ కరెప్షన్‌ల పార్టీ అని మండిపడ్డారు. జగన్‌ కారణంగా రాజకీయ నేతలు, అధికారులు బలయ్యారని ఆరోపించారు ఆనం. ఆనం వివేకానందరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. వివేకానందరెడ్డి వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఎలా స్పందించనున్నదో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు