పొంగులేటి నీతులు

పొంగులేటి నీతులు

వ్యక్తిగత అజెండాలతో, ప్యాకేజీలకు ఆశపడి నేతలు కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెసు నేతలు వివేక్‌, మందా జగన్నాథం, కేశవరావు కాంగ్రెసు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతుండడంపై పొంగులేటి అసహనం ప్రదర్శించడం జరిగింది. రాజకీయ క్విడ్‌ ప్రోకోతోనే తెలంగాణ అంశాన్ని ముందు పెట్టి కాంగ్రెసుపై విమర్శలు చేస్తూ కేకే,వివేక్‌,మందా మాట్లాడుతున్నారని పొంగులేటి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్‌ నేతలు, ఎంపీలను ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన దూషణలు అందరికీ తెలుసని, దీక్ష దగ్గర జరిగిన అవమానాలను ఎంపీలు మరిచిపోవడం హాస్యాస్పదమన్నారాయన.

కాంగ్రెసు పార్టీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సుబ్బిరామిరెడ్డిల వివాదంపై స్పందిస్తూ నేతలు పరస్పర విమర్శలు మానుకోవాలని.. పార్టీ పెద్దలు వారికి నచ్చజెప్పాలన్నారు. కాని ఆ చర్యలేవీ కాంగ్రెసు అధిష్టానం తీసుకోవడంలేదు. తెలంగాణ అంశంలో ఏదో ఒక స్పష్టత ఇవ్వకపోవడం వలన ఆ పార్టీ వారికే నమ్మకం లేకుండా పోతున్నది. అలాంటప్పుడు పొంగులేటి వంటి నేతలు నీతులు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు