ఇద్దరిలో... ఎవరి మాట కరెక్ట్

ఇద్దరిలో... ఎవరి మాట కరెక్ట్

మహానాడులో తెలంగాణపై తీర్మానం అనంతరం టీఆర్ఎస్ నేతలు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు సంధించటం తెలిసిందే. నిత్యం.. ఏదో విధంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా ప్రజల మనసుల్లోకి నాటటానికి  టీఆర్ఎస్ నేతలు ఎన్నెన్నో ఎత్తులు వేస్తేన్నారు. అయితే.. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒకపక్క టీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు చేతనైనంతగా తెలుగుదేశంపై విమర్శలు చేస్తున్నారు. మహానాడులో తెలంగాణపై స్పష్టమైన వైఖరి వ్యక్తం చేయలేదంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్లో సీనియర్ నేతగా వ్యవహరించే కేకే.. తాజాగా టీఆర్ఎస్ లో చేరేందుకు ముహుర్తం కూడా ఖరారైంది.

ఇప్పుడు ఆయనేమో... తెలంగాణపై తెలుగుదేశం అంకితభావంతో ఉందని వ్యాఖ్యనించారు. తెలంగాణ టీడీపీ నేతల్లో అంకిత భావం ఉందని.. వారి మాటల్లో చిత్తశుద్ధి ఉందని కితాబు ఇచ్చారు. అయితే.. ఆ పార్టీ ఆంధ్రానాయకత్వంలో ఉన్నందున ఆ ప్రభావం కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకానీ టీడీపీకి తెలంగాణపై మరో ఆలోచన ఉందని చెప్పకపోవటం గమనార్హం. టీడీపీని దెబ్బ తీసేందుకు ఒంటికాలిపై తాము ఒక పక్క అపసోపాలు పడుతుంటే.. పార్టీలో కొత్తగా చేరనున్న కేకే టీడీపీకి అనుకూలంగా మాట్లాడటంపై టీఆర్ఎస్ నేతలు తీవ్రమైన అసంతృప్తని వ్యక్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు