కరోనా ఉన్నా మోసం చేసి ఇండియాలో దిగారు

కరోనా ఉన్నా మోసం చేసి ఇండియాలో దిగారు

కరోనా కలకలం రేగుతున్న వేళ, కరీంనగర్‌లో ఓ మత ప్రచార కార్యక్రమానికి పదిమంది ఇండోనేషియన్ వాసులు రావడం సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. వారందరూ కరోనా పాజిటివ్‌గా తేలడంతో కరీంనగర్‌లో లాక్‌డౌన్ ప్రకటించి, రాకపోకలను పూర్తిగా మూసివేశారు. ఈ బృందం కలిసిన దాదాపు 500 మంది వివరాలు సేకరించేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పటికే  కొందరిని గుర్తించిన అధికారులు, వారిని ఇళ్లల్లో క్వారంటైన్ చేయగా, మరికొందరిని ఆసుపత్రులకు పంపించారు, ఇప్పటిదాకా సేకరించిన వివరాల్లో ఇండోనేషియా బృందంతో ప్రయాణించిన ఒక వ్యక్తి కరోనా పాజిటివ్‌‌గా తేలాడు.

అయితే మత ప్రచార కార్యక్రమం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వీళ్లు, కరోనా సోకిందనే విషయం తెలియక వచ్చారని భావించారంతా! అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి.

ఇండోనేషియా నుంచి బయలుదేరక ముందే వీరిలో కరోనా లక్షణాలు కనిపించాయట. అయితే ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి దొరికిపోతే, ఆసుపత్రిలో పెడతారని, తాము వెళ్లాల్సిన పని ఆగిపోతుందనే భయంతో పారాసిటమాల్ మాత్రలు వేసుకున్నారని తేలింది.

ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా యథేచ్ఛగా తిరిగిన ఈ పదిమంది, ఢిల్లీలో నాలుగు రోజులు గడిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి రామగుండం దాకా రైళ్లో వచ్చారు. అక్కడి నుంచి కరీంనగర్‌కు వెళ్లి, మత ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత బృందంలో ఒకరు తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడుతుంటే, పరీక్షించగా అసలు విషయం తెలిసింది. కరోనా ప్రాణాంతక వ్యాధి అని తెలిసి, అది ఒకరి నుంచి వేల మందికి వ్యాపిస్తుందని తెలిసీ... ఆ విషయాన్ని దాచి మతప్రచారం కోసం వచ్చిన వీళ్లని ఏమనాలి!

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English