విశాఖ నుంచి సుబ్బారెడ్డి పోటీ?

విశాఖ నుంచి సుబ్బారెడ్డి పోటీ?

వైకాపా విశాఖ టికెట్ సుబ్బారెడ్డికి ఖరారైంది. ఆయన జగన్ కు అత్యంత సమీప బంధువన్న సంగతి తెలిసిందే. నిజానికి ఇక్కడ నుంచి జగన్ సోదరి షర్మిల పోటీ చేస్తుందని భావించారు. ఎందుకంటే ఆమె కోరిన సీటుకు బదులుగా విశాఖను షర్మిలకు కేటాయించినట్లు వార్తలు వినవచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం సుబ్బారెడ్డిని విశాఖ నుంచి పోటీ చేయమని జగన్ కోరినట్లు తెలిసింది.

అయితే పురంధ్రీశ్వరి, గంటా శ్రీనివాసరావు లాంటి వారితో పోటీ అంటే కాస్త భారీ మొత్తం అవసరం. దీంతో సుబ్బారెడి ముందు వెనుకలు ఆడుతున్నట్లు తెలిసింది. కానీ వారిని ఢీకొనాలంటే, సుబ్బారెడ్డే సరైన అభ్యర్థి అని జగన్ భావించి., ఆయన పేరే ఖరారు చేసాడని వినికిడి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు