కరోనా మరణాలు: చైనా ను మూడో ప్లేస్ లోకి నెట్టిన మరో కంట్రీ

కరోనా మరణాలు: చైనా ను మూడో ప్లేస్ లోకి నెట్టిన మరో కంట్రీ

కరోనా మహమ్మారి కారణంగా పదిపదిహేను రోజుల క్రితం చైనాలో 3వేలమందికి పైగా మృతి చెందిన విషయం అందరినీ కలిచివేసింది. కానీ ఆ తర్వాత అక్కడి మృతుల సంఖ్య ఆగిపోయింది. గత నాలుగైదు రోజుల్లోనే ఇటలీలో దాదాపు మూడవేల మందికి పైగా చనిపోయారు. దీంతో చైనాను దాటేసింది. ఈ రోజుకు చైనాలో 3,281 మంది మృత్యువాత పడితే, ఇటలీలో ఆ సంఖ్య రెండింతల కంటే ఎక్కువ 6,820గా ఉంది. ఇప్పుడు మరణాల సంఖ్యలో చైనాను ఇప్పుడు మరో దేశం కూడా దాటివేయడం ఆందోళన కలిగించే అంశం.

నిన్నటి వరకు 3వేల లోపు మరణాలు ఉన్న స్పెయిన్‌లో ఈ రోజు ఏకంగా 443 పెరిగాయి. దీంతో మరణాల సంఖ్య 3,434కు చేరుకుంది. కొత్త కేసులు కూడా భారీగానే పెరిగాయి. 5,552 పెరిగాయి. కొత్త కేసులు చైనాలో 47, అమెరికాలో 225, స్పెయిన్‌లో 5,552, జర్మనీలో 2,723, ఇరాన్‌లో 2,206, స్విట్జర్లాండ్‌లో 660, నెదర్లాండ్స్‌లో 852, బెల్జియం, పోర్చుగల్ దేశాల్లో 600కు పైగా పెరిగాయి.

కొత్త మరణాలు చైనాలో 4, అమెరికాలో 5, జర్మనీలో 22, ఇరాన్‌లో 143, నెదర్లాండ్స్‌లో 80 ఉన్నాయి. ఇటలీలో కొత్త కేసులు, కొత్త మరణాల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ కొత్త కేసులు లేకుండా ఇటలీకి అతి పెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు ఇక్కడ ప్రతి రోజు వందల్లో మృత్యువత పడ్డారు.

వైరస్ సోకిన వారి విషయానికి వస్తే చైనాలో81, ఇటలీలో 69 వేలు, అమెరికాలో 55వేలు, స్పెయిన్‌లో 47వేలు, జర్మనీలో 35,700,  ఇరాన్‌లో 27వేలు, ఫ్రాన్స్‌లో 22వేలకు పైగా ఉన్నారు. చైనా (3,281), ఇటలీ (6,820), స్పెయిన్ (3,434),  ఇరాన్ (2,077), ఫ్రాన్స్ (1,100) దేశాల్లో మృతుల సంఖ్య వేలల్లో ఉంది. అమెరికాలో 785 మంది చనిపోయారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English