కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ లో ఏముంది?

కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ లో ఏముంది?

ఇదో అరుదైన సందర్భం. ప్రపంచం మొత్తం సంక్షోభంలో చిక్కుకొని.. ఎవరికి వారు.. తమను తాము రక్షించుకోవటం కోసం అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్న సమయం. భారత్ లాంటి దేశంలో 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించటం ఇటీవల కాలంలో ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు. అసాధారణ పరిస్థితుల్లో తీసుకున్న అసాధారణ నిర్ణయం చూస్తే..పరిస్థితి ఎంత తీవ్రమైనదన్న విషయంతోపాటు.. ఇలా కాకుంటే దేశాన్ని కాపాడుకోలేమన్న ఆలోచనే తాజా ప్రకటనకు కారణంగా చెప్పక తప్పదు.

జాతిని ఉద్దేశించి మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుందన్న ప్రచారం జరిగిన వేళ.. అందరూ ఎంతో ఆసక్తితో టీవీలకు అతుక్కుపోయారు. కరోనా వేళ.. మోడీ నోట కీలక ప్రకటన వెలువడుతుందన్న మాటకు తగ్గట్లే.. ఆయన 21 రోజుల లాక్ డౌన్ ను ప్రకటించారు. అందరూ పది రోజులు.. పన్నెండు రోజులు లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తే.. అందరి అంచనాలకు భిన్నంగా ఆయన 21 రోజులకు ప్రకటించేశారు.

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత.. కేంద్రం లాక్ డౌన్ కు సంబంధించిన మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దేశం మొత్తం మూసివేసిన వేళలోనూ.. పని చేయాల్సిన రంగాలకు సంబంధించిన మినహాయింపుల్ని విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం దేశంలో  మినహాయింపులు ఎవరికంటే..?

* రక్షణ.. కేంద్రం పారామిలటరీ బలగాలు
* ట్రెజరీ
* ఇంధన.. గ్యాస్.. విద్యుత్ ఉత్పత్తి.. పంపిణీ
* తపాలా సేవలు
* జాతీయ సమాచార వ్యవస్థ
* ముందస్తు హెచ్చరికల కేంద్రాలు
* విపత్తు నిర్వహణ

రాష్ట్రాల విషయానికి వస్తే..
* పోలీసు.. హోం గార్డ్స్
* పౌర రక్షణ
* అగ్నిమాపక.. అత్యవసర సేవలు
* జైళ్లు.. జిల్లా పరిపాలన
* ట్రెజరీ.. విద్యుత్. నీరు.. పారిశుద్ద్యం..
* ఆసుపత్రి.. అనుబంధ వ్యవస్థల నిర్వహణ
* మందుల షాపులు.. వైద్య పరికఱాల దుకాణాలు..
* ల్యాబ్ లు.. అంబులెన్సులు.. వైద్య రంగంలో పని చేసే సిబ్బంది
* రేషన్ దుకాణాలు..ఆహారపదార్థాలు.. పండ్లు..కూరగాయలు.. పాలు..మాంసం దుకాణాలు
* బ్యాంకులు.. బీమా కార్యాలయాలు.. ఏటీఎంలు
* ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
* టెలి కమ్యునికేషన్ వ్యవస్థ.. కేబుల్ సేవలు
* ఆహారపదార్థాలు.. ఔషధాలు.. వైద్య పరికరాలు.. ఈ కామర్స్ ద్వారా సరఫరా
* పెట్రోల్ పంపులు.. గ్యాస్ కేంద్రాలు
* కిందిస్థాయిలో విద్యుత్ రంగ సేవలు అందించేవారు
* కోల్డ్ స్టోరేజ్.. గిడ్డంగులు.. ప్రైవేటు సెక్యురిటీ ఏజెన్సీలు
* నిత్యవసరాల తయారీ యూనిట్లు

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English