కరోనా.. అక్కడ యువకుడినే చంపేసింది

కరోనా.. అక్కడ యువకుడినే చంపేసింది

ఇప్పటిదాకా కరోనా మృతుల్లో చాలామంది వృద్ధులే! కాబట్టి ప్రభుత్వ ఆదేశాలను, హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా ‘వయసులో ఉన్న మాకేం కాదంటూ’ చాలామంది యువకులు యథేచ్ఛగా బయట తిరిగేస్తున్నారు. అయితే అంత అతి నమ్మకం పనికి రాదంటూ ఓ టీనేజర్ ప్రాణాలు తీసింది కరోనా మహమ్మారి.

కరోనా కారణంగా ఆరోగ్యంగా ఉన్న ఓ టీనేజర్ ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలవరబెడుతోంది. టీనేజ్ వయసులో ఉన్నవారికి రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి కరోనా సోకినా ప్రాణాలు పోయే ప్రమాదం చాలా తక్కువని భావించారు వైద్యులు. అయితే అమెరికాలో ఓ టీనేజర్ ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆ వ్యక్తి, కరోనా నుంచి కోలుకుంటాడని భావించినా సడెన్‌గా పరిస్థితి విషమించి ప్రాణాలు పోయాయి. కరోనా కారణంగా అమెరికా పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటివరకు 52,976 కేసులు అక్కడ నమోదయ్యాయి.

కేవలం న్యూయార్కులోనే 25,000 పైచిలుకు కేసులు నమోదుకాగా.. అందులో 200లకు పైబడి ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ లో అయితే  ఈ వైరస్ సోకడానికి వయసుతో సంబంధం లేదని, ఏ వయసు వారైనా జాగ్రత్త పడకపోతే ప్రాణాలు పోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.  ఒక్క లాస్ ఏంజెల్స్‌లోనే కోటి మంది ఇళ్లకే పరిమితం కాగా 662 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. హాలీడేస్ వచ్చాయని క్రికెట్ ఆడేందుకు, బయట తిరగడానికి వస్తున్న యువకులారా... ఇప్పుడైనా మారండి!

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English