మోడీ సార్... మోడీ సార్ అంతే!!

మోడీ సార్... మోడీ సార్ అంతే!!

'ప్రపంచదేశాలందు భారతీయుల తీరు వేరయా!’ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ఏదైనా విషయం నచ్చకపోతే ఇక్కడి వాళ్లు స్పందించే తీరు, ఎవరైనా నచ్చితే నెత్తిన మోసే తీరు పూర్తిగా వేరే రేంజ్‌లో ఉంటుంది. అలాంటి వంద కోట్లకు పైగా ఉన్న జనాన్ని ఒక్క తాటిపైకి తీసుకురావడం అంత తేలికైన పని కాదు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. జనతా కర్ఫ్యూ రోజున దేశమంతా ఎక్కడికక్కడ స్థంభించిపోవడం చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు 21 రోజలు లాక్ డౌన్ నిర్ణయం కూడా అలాంటిదే!

దేశంలో కరోనా విస్తరిస్తోందని గ్రహించిన కేంద్రం... ముందు జనాలు గుంపులు చేరే థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కరోనా విస్తరించడానికి నిలువరించేందుకు మార్చి 22న జనతా కర్ఫ్యూ నిర్వహిద్దామంటూ దేశప్రజలందరి సహకారం కోరారు మోడీ. పీఎం సాబ్ ఇచ్చిన పిలుపుతో యావత్ భారతం ఇళ్లల్లోంచి బయటికి రాలేదు. ఒక్క రోజు కర్ఫ్యూ సక్సెస్ కావడంతో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను, 75 జిల్లాలను లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు మోదీ.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించడం... జనాల నుంచి సహకారం లభించడంతో ఏకంగా దేశమంతా మూడు వారాల పాటు లాక్ డౌన్ అంటూ సంచలన ప్రకటన చేశారు మోదీ. బయటికి వస్తే సచ్చిపోతారని ఒకేసారి చెప్పి లాక్ డౌన్ చేస్తే జనాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చేది. అలా కాకుండా మెల్లిమెల్లిగా జనాలకు పరిస్థితి అర్థం అయ్యేలా చేసి, లాక్ డౌన్ ఆవశ్యకత తెలిసేలా చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు మోడీ అండ్ కో.... ఈ టైమ్‌లో వేరేవాళ్లు అధికారంలో ఉంటే ఎలా ఉండేదో తెలీదు కానీ మోడీ సార్ సిట్యూవేషన్‌కు తగ్గట్టుగా వ్యవహారిస్తున్నారని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే.

‘మోడీ సార్... మోడీ అంతే!!’ అంటున్నారు పీఎం సాబ్ ప్లానింగ్ అర్థమైన కొందరు రాజకీయ విశ్లేషకులు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English