చైనా నుంచి మరో వైరస్... నిజమెంత?

చైనా నుంచి మరో వైరస్... నిజమెంత?

హంటాన్ వైరస్... (Hantaan) సోషల్ మీడియాలో ఈ పేరు తెగ వైరల్ అవుతోంది. కరోనా వైరస్‌లాగే చైనాలో పుట్టిన హంటాన్ వైరస్... అక్కడి నుంచి ప్రపంచదేశాలన్నింటికీ విస్తరిస్తోందని ఈ వార్తల్లో ఉన్న సారాంశం. అయితే ఇది కేవలం ఓ పుకారు మాత్రమే.

హంటాన్ వైరస్ అనేది ఎలుకల నుంచి వాటిని తినే మనుషులకు సోకే వైరస్. 1951-53లో జరిగిన కొరియన్ యుద్ధంలో సైనికులను చంపేందుకు ఈ వైరస్‌ను ఎక్కించిన మాంసాన్ని ఆహారంగా పెట్టారని 1976లో తేలింది.  కొనేళ్ల కిందట చైనాలో ఈ వైరస్ బాగా వ్యాపించింది, ఆ తర్వాత మాయం అయిపోయింది కూడా. ఇది ప్రాణాలే తీసేంత ప్రమాదకరమైనదే అయినప్పటికీ కరోనా వైరస్‌లాగా హంటాన్ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకదు. కాబట్టి ఇలాంటి పుకార్లను నమ్మకండి.

చైనాలో 150 రకాల వైరస్‌లు పుట్టాయని, ప్రపంచదేశాలపై వదిలేందుకు ఆ దేశం ఈ వైరస్ బ్యాంకును పెంచి పోషిస్తోందని కూడా పుకార్లు వ్యాపించాయి. ఇలాంటి వార్తల్లో నిజం ఎంతనేది వివేకంతో ఆలోచిస్తే ఎవ్వరికైనా అర్థం అవుతుంది. కాబట్టి ఆలోచన లేకుండా వాట్సాప్ మెసేజ్‌లను నమ్మి, ఫార్వర్డ్ చేయకండి. ఎవ్వరైనా ఇలాంటి పుకార్లను పంపింతే, వారికి విషయాన్ని వివరించేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే  కొన్నిసార్లు ఇలాంటి పుకార్లు వైరస్ కంటే భయంకరమైనవిగా మారచ్చు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English