ముందుచూపు లేక అల్లు అరవింద్ తంటాలు!

ముందుచూపు లేక అల్లు అరవింద్ తంటాలు!

కరోనా పుణ్యమా అని జనాలు ఇళ్ళు దాటట్లేదు. ఒకవేళ బయటకు వెళ్లినా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు. సినిమా థియేటర్లు మూత పడడంతో పాటు టెలివిజన్ సీరియల్స్ నిర్మాణం కూడా ఆగిపోయింది. దీంతో జనం ఓ.టి.టి. స్ట్రీమింగ్ మీదే డిపెండ్ అవుతున్నారు. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోకి ట్రాఫిక్ టూ మచ్ ఉంటోంది.

జనం ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కోసం వెతుకుతున్నారు. ఇలాంటి సమయాన్ని కూడా అల్లు అరవింద్ మొదలు పెట్టిన ఆహా ఉపయోగించుకోలేకపోతోంది. కారణం అందులో తగినన్ని సినిమాలు లేవు. ఆల్రెడీ పెద్ద సంస్థలు పాతుకుపోయిన రంగంలోకి వచ్చేప్పుడు ఉండాల్సిన దూకుడు, ముందుచూపు అల్లు అరవింద్ కి ఈ విషయంలో కొరవడింది. కనీసం అల వైకుంఠపురములో హక్కులు కూడా సొంతం చేసుకోలేకపోయారు.

ఇదిలా వుంటే ఆహా ప్రచారం కోసం చేపట్టిన కార్యక్రమాలు కూడా కరోనా బంద్ వల్ల ఆగిపోయాయి. సినిమాలు తీసే విషయంలో అరవింద్ ఎంత పకడ్బందీగా ఉంటారో ఈ బిజినెస్ లో అంతగా అనుభవ రాహిత్యంతో ఇబ్బంది పడుతున్నారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English