దొరికిపోయిన టీఆర్ఎస్

దొరికిపోయిన టీఆర్ఎస్

టీఆర్ఎస్.. తెలుగుదేశం పార్టీల మధ్య నడుస్తున్న సవాళ్ల పర్వంలో టీఆర్ఎస్ అడ్డంగా బుక్కైపోయింది. మహానాడులో తెలంగాణపై స్పష్టమైన తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత.. దాని ప్రభావం తమ పార్టీపై ఉంటుందని భావించిన టీఆర్ఎస్ టీడీపీ తీర్మానంపై విమర్శలు చేయటం మొదలుపెట్టింది. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు బలమైన బదులిస్తున్న టీడీపీ నేతలు.. ‘‘మీకు సందేహాలు ఉంటే.. మీ నాయకుడు కేసీఆర్, హోంమంత్రి చిదంబరంలు కలిసి తెలంగాణ తీర్మానం ప్రతిని తయారు చేసుకురండి.. మా అధినేత చేత సంతకం చేయించి ఇస్తాం’’ అంటూ సవాలు విసిరారు.

దీనికి  ప్రతిగా మూడు ప్రతిపాదనలకు సరేనంటే.. తమ పార్టీని టీడీపీలో విలీనం చేస్తానంటూ టీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రతిసవాలు విసిరారు. దానికి టీడీపీ నేతలు మరోమారు స్పందించి.. హరీష్ రావు కోరిన వాటికి తాము సిద్ధమేనని.. టీడీపీలోకి టీఆర్ఎస్ లోకి విలీనం చేసే ప్రక్రియ హరీష్ సొంతది లేక పార్టీ నిర్ణయమా అన్నది తేల్చమంటూ టీడీపీ నేత రేవంత్ రెడ్డి సవాలు విసరటంతో ఈ మొత్తం వ్యవహారం రసకందాయకంలో పడినట్లయింది. టీఆర్ఎస్ పార్టీ పాలిట్ బ్యూరోలో పార్టీని విలీనం చేసే అంశంపై తీర్మానం చేస్తే.. హరీష్ రావు కోరినట్లుగా తాము చేయటానికి సిద్ధమనటంతో టీఆర్ఎస్ అడ్డంగా దొరికిపోయినట్లయింది.

రేవంత్ తాజా వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందిస్తూ తాను విసిరిన సవాలును రేవంత్ సరిగా  అర్థం చేసుకోలేంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారే తప్ప... విలీనం ఊసు మాత్రం ఎత్తలేదు. విలీనం అంటూ ఎగేసుకునే టీఆర్ఎస్ నేతలు ఇకనైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందువెనకా చూసుకుంటారో లేదో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు