భువనేశ్వరి బ్రేకేసిందా?

భువనేశ్వరి బ్రేకేసిందా?

దగ్గుబాటి దంపతులు తెలుగుదేశం పార్టీలోకి వద్దామనుకున్నారా? కానీ బాబు భార్య భువనేశ్వరి బ్రేక్ వేసిందా? అవునని అంటున్నాయి తెలుగుదేశానికి చెందిన కొన్ని వర్గాలు. కాంగ్రెస్ నుంచి తిరిగి తెలుగుదేశంలోకే వెళ్లాలని డాక్టర్ దంపతులు అనుకున్నారట.  ఎవరైనా గోడదూకడం అని అంటే, మా స్వంతపార్టీకి మేం వచ్చాం అని చెప్పుకోవచ్చని అనుకున్నారట. ఈ విషయం ముందుగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం నాయకుల చెవిని వేసి, ఆ మేరకు ఫ్లెక్సీలు కట్టించి, గ్రౌండ్ ప్రిపేర్ చేయించారట. ఆ పైన బాలయ్య ద్వారా రాయబారం నడిపారని వినికిడి.

అయితే దానికి అటు బాబు కాస్త ఊగిసలాడాడని, అయితే తన భర్తను చాలా సార్లు పబ్లక్ గా విమర్శించి, ఇప్పుడు పార్టీలోకి ఎలా వస్తారని భువనేశ్వరి అడ్డం పడినట్లు వినికిడి. ఈ విషయంలో మరెవరి మాటా విననని ఆమె కరాఖండీగా చెప్పేసారని అంటున్నారు. దాంతో ఇక తెలుగుదేశం తలుపులు మూసుకుపోవడంతో చేసేది లేక భాజపాను ఆశ్రయించారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు