బాబు ఎన్నికల ఫండ్ 1500 కోట్లు

బాబు ఎన్నికల ఫండ్ 1500 కోట్లు

చావో బతుకో...అన్న రేంజ్ లో పోరాడాల్సి వస్తోంది ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం. గడచిన రెండు ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది. ఈసారి మరో దెబ్బతింటే మరి లేవలేదు. అది నిజం. అందుకే బాబు తన సర్వశక్తులు ఒడ్డి పోరాటానికి దిగుతున్నారు. ఆ విషయం కూడా ఆయనే చెప్పారు. ఎరాసు,  టీజీ తదితరులను పార్టీలోకి చేర్చుకునేటపుడు, ఈసారి పడుతున్నంత కష్టం ఇంతకు ముందు ఎప్పుడూ పడలేదని ఆయనే అన్నారు. నిజానికి బాబు కష్టం యాభై శాతం అప్పుడే ఫలించిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంతమంది భారీగా ఇతర పార్టీల నుంచి, తన పార్టీలోకి తరలి రావడం, తెలుగుదేశం పట్ల ఒక పాజిటివ్ ప్రచారం మొదలుకావడం గమనించాలి. ఇక మిగిలింది పాజిటివ్ ప్రచారం అంతా ఓటింగ్ గా మారడం.  ఇందుకోసం కూడా చంద్రబాబు తన సాధనసంపత్తి అందా సిద్ధం చేస్తున్నారని వార్తలు అందుతున్నాయి. ఇంతవరకు బాబు డబ్బు వ్యవహారాలు ఎప్పుడూ పట్టించుకోలేదు. సుజనా చౌదరి ఎక్కువగా ఈ విషయాలు చూసుకుంటారని పార్టీ వర్గాల బోగట్టా.

తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిత్యం నాయకులు, కార్యకర్తలను బాగానే చూసుకుంటుంది. నియోజకవర్గాల్లో తిరిగే వారిలో చాలా మందికి కొంత సహాయం రెగ్యులర్ గా గడచిన పదేళ్లుగా అందుతూనే వుంది. పైగా పార్టీ ఆఫీసుకు వచ్చేవారికి భోజన సదుపాయం, వసతి సదుపాయం వుంటుంది. అయితే ఎన్నికల్లో ఫండింగ్ అన్నది బాబు పెద్దగా పట్టించుకోరు. కానీ ఈసారి ఆ విషయంపై కూడా బాబు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సుజన, సిఎమ్ రమేష్, మరి కొందరు కీలక వ్యక్తులతో కలిసి ఇందుకోసం భారీ మొత్తం కేటాయించినట్లు తెలిసింది. ముఖ్యంగా ఇటీవల పార్టీలోకి వచ్చిన చాలా మందికి బాబు, ఎన్నికల ఖర్చలు ప్రామిస్ చేసారని వినికిడి. మరొపక్క పవన్ తో డీల్ కుదిరిందని అంటున్నారు. అది నిజమో కాదో, 25న తేలిపోతుంది. పవన్ పార్టీకి మద్దతు ఇస్తే, వచ్చే పాజిటివ్ నెస్ ను ఓట్లలోకి మార్చి, దాన్ని నోట్ల ఖర్చులో లెక్కిస్తే అయిదు వందల కోట్లు పెద్ద మొత్తం కాదని అంటున్నారు. మరోపక్క తెలంగాణలో అధికారంలోకి రాకపోయినా, కనీసం మంచి స్థానం సంపాదించి, వచ్చే ఎన్నికల వరకు పార్టీని నిలబెట్టుకోవాలని, అందుకోసం కూడా ఈసారి భారీగా ఖర్చు చేయకతప్పదని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, అందుకే 1500 కోట్ల ఫండ్ రెడీ చేసారని, ఈసారి అందులో భారీ వాటా కూడా బాబుదే అని వినికిడి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు