చిరంజీవి లాస్ట్‌ అండ్‌ ఫైనల్‌ షాట్‌!

చిరంజీవి లాస్ట్‌ అండ్‌ ఫైనల్‌ షాట్‌!

కాంగ్రెస్‌ పార్టీలో ప్రజారాజ్యాన్ని కలిపేసిన చిరంజీవి దాని వల్ల ఏమి సాధించారనేది తెలియదు కానీ... ఒకవేళ అలా చేసి ఉండకపోతే ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలక శక్తిగా ఎదిగుండేవారు. 'అలా చేసి ఉండకపోతే' అనే దానిని పక్కన పెట్టేసిన చిరంజీవి అలా చేసేసా కాబట్టి ఇప్పుడేంటి అనే ఆలోచిస్తున్నారట. కాంగ్రెస్‌ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీని రిప్రజెంట్‌ చేస్తూ ప్రజల్లోకి వెళ్లడం కూడా సాహసోపేతమే. అయినా కానీ పార్టీకి కట్టుబడి ఈసారి పార్టీకి తనే ప్రచార సారథి కావడానికి చిరంజీవి నిర్ణయించుకున్నారు. ఈసారి రాజకీయంగా తన భవిష్యత్తు ఏమిటనేది కూడా తేల్చేసుకోవడానికే చిరంజీవి నిర్ణయించుకున్నారట.

ఈసారి కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొస్తే చిరంజీవి రాజకీయాల్లో కొనసాగుతారట. ఒకవేళ అది జరగకపోతే మాత్రం నెమ్మదిగా రాజకీయాల నుంచి తప్పుకుని తిరిగి వెండితెరపై కనిపిస్తారట. చాలా కాలంగా చేయకుండా పెండింగ్‌లో పెట్టిన తన 150వ చిత్రాన్ని పూర్తి చేసి.. అటు తర్వాత మల్టీస్టారర్స్‌ వైపు మొగ్గు చూపిస్తారట. సో చిరంజీవి రాజకీయ భవిష్యత్తు మొత్తం ఈ ఎన్నికలతో తేలిపోబోతోంది అన్నమాట. ఇదే సమయంలో తన తమ్ముడు రంగ ప్రవేశం చేస్తుండడం చిరంజీవిపై ఎక్స్‌ట్రా ప్రెజర్‌ అయ్యేట్టుంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English