నిండు గర్భంతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

నిండు గర్భంతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

రాజకీయాల్లో మహిళలు పరిస్థితులనుఅధిగమిస్తూ ముందుకుసాగుతున్నారు. చంటిబిడ్డతో పార్లమెంటుకు వచ్చిన న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్ ప్రపంచవ్యాప్తంగా అందరినీ దృష్టినీ ఆకర్షించారు. ఇప్పుడు అదే తరహాలో మహారాష్ట్రలో నిండు గర్భిణి అయిన ఓ ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరై దేశం దృష్టిని ఆకర్షించారు.

30 ఏళ్ల నమిత అక్షయ్ ముందాడ బీడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. నిండు గర్భిణి అయినప్పటికీ తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఆమె శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు.

సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్తానని, అందుకే గర్భంతోనూ సమావేశాలకు హాజరైనట్టు నమిత తెలిపారు. సమావేశాలకు వచ్చినప్పటికీ వైద్యుల సలహా పాటిస్తున్నట్టు తెలిపారు. ఎన్సీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమె మొన్నటి 2019 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. యువ నాయకురాలిగా మహారాష్ట్రలో మంచి పేరున్న నమిత నిండు గర్భిణిగా ఉంటూ సభకు హాజరవడంతో పార్టీలకు అతీతంగా మిగతా సభ్యులంతా ఆమె ఆరోగ్యం గురించి సమాచారం అడిగి తెలుసుకుని జాగ్రత్తలు చెప్పారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English