ఫిబ్రవరి 29న ఫ్లోరిడాలోని టంపాలో `గోదావరి` గ్రాండ్ ఓపెనింగ్

ఫిబ్రవరి 29న ఫ్లోరిడాలోని టంపాలో `గోదావరి` గ్రాండ్ ఓపెనింగ్

త‌మ క‌ల‌ల‌ను నెర‌వేర్చుకునేందుకు స‌ప్త స‌ముద్రాలు దాటి భార‌త్ నుంచి అమెరికా వ‌చ్చిన తెలుగువారికి.....దక్షిణాది వంటకాలు, తెలుగింటి క‌మ్మ‌టి భోజ‌నం అందించాల‌నే ల‌క్ష్యంతో ఐదేళ్ల క్రితం `గోదావ‌రి` రెస్టారెంట్ ప్రారంభించాం.

ఒక రెస్టారెంట్ తో మొద‌లైన `గోదావ‌రి` ప్ర‌స్థానం....అన‌తి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి దాదాపు 30 రెస్టారెంట్లు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. యూఎస్ ఏలో `గోదావ‌రి` ఈజ్ నాట్ ఎ రెస్టారెంట్....ఇట్స్ ఎ బ్రాండ్....అన్న త‌ర‌హాలో తెలుగు ప్ర‌జ‌ల‌తో పాటు అమెరిక‌న్ల‌కు నాణ్య‌మైన‌, రుచిక‌ర‌మైన భార‌తీయ వంట‌కాల‌ను అందిస్తూ అంద‌రి మ‌న్న‌న‌లు చూరగొంది.

ఇంతితై...వ‌టుడింతై అన్న చందంగా ఎదిగిన `గోదావ‌రి` తాజాగా ఫ్లోరిడాలోని టంపాలో బ్రాంచ్ ను ప్రారంభించబోతోందని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. ఫిబ్రవరి 29న ఫ్లోరిడాలోని టంపాలో `గోదావ‌రి`రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన గ్రాండ్ ఓపెనింగ్ స్పెష‌ల్ బ‌ఫెట్ కు వ‌చ్చి మా ఆతిథ్యం స్వీకరించండి (Indian restaurants in Florida).

గ‌డిచిన ఐదేళ్ల కాలంలో, `గోదావరి` పట్ల మీరు నిరంత‌రం అందించిన మ‌ద్ద‌తు, మాపై చూపిన అభిమానం మ‌మ్మ‌ల్ని మ‌రింత బాధ్య‌తాయుతంగా తీర్చిదిద్దాయి. అంతేకాకుండా మీ అంచ‌నాల‌కు త‌గిన రీతిలో వినూత్న వంటకాలను అందించేందుకు మేం కృషి చేస్తూనే ఉన్నాం. `గోదావరి` ప్రారంభించినప్పటి నుంచి నేటివరకు అతిథులు అన్ని వేళలా మా వెంట లేక‌పోయి ఉంటే మేం ఇంత గొప్ప స్థితిలో ఉండేవాళ్లం కాదు.

ఇంతకాలం `గోదావరి`పై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, మీరు అందించిన విశేషమైన మ‌ద్ద‌తుకు మేం సదా రుణపడి ఉంటాం. `గోదావరి` ఇంతటి విజ‌యం సాధించ‌డం వెనుక మా వెండ‌ర్లు, ఫ్రాంచైజర్లు, కస్టమర్లు, ఉద్యోగుల మ‌ద్ద‌తు మ‌రియు ప్రోత్సాహం మరువలేనిదని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాం.

`గోదావరి` ఒక కుటుంబంలాగా భావించి టీంలోని సభ్యులంతా అందించిన స‌హాయ స‌హ‌కారాల వ‌ల్లే ఈ రోజు ఇంత గుర్తింపును సొంతం చేసుకున్నామని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. మీ ఆదరాభిమానలతోనే ఫ్లోరిడాలోని టంపాలో గోదావరి రెస్టారెంట్ ను ప్రారంభించబోతున్నాం (Godavari Tampa).

రెస్టారెంట్లను ఏర్పాటు చేసే లొకేషన్లను గోదావరి టీం ప్రణాళికాబద్ధంగా ఎంచుకుంటోంది. టంపాలో అతి పెద్ద భారతీయ గ్రోసరీ స్టోర్ గా పేరుగాంచిన `పటేల్ బ్రదర్స్` పక్కనే `గోదావరి`రెస్టారెంట్ ను ప్రారంభించబోతున్నాం. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, వెరిజోన్ వంటి అనేక కార్పొరేట్ దిగ్గజ సంస్థలకు అతి సమీపంలో గోదావరి రెస్టారెంట్ ఉందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం.

`ఖిలాడి`పేరుతో న్యూయార్క్ లోని మ్యాన్ హాట్టన్ లో గోదావరి టీం ప్రారంభించిన దక్షిణ భారతీయ `గ్యాస్ట్రోబార్` కొత్త ఒరవడి రేపింది. సంప్రదాయ భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్లతోపాటు వినూత్న రుచులను అందించే రెస్టారెంట్లను ప్రారభించేందుకు గోదావరి సన్నాహాలు చేస్తోంది.

టంపాలో భారతీయ రెస్టారెంట్ లేని లోటును తీర్చేందుకు `గోదావరి టంపా` రెస్టారెంట్ ను ప్రారంభించారు. `గోదావరి టంపా` రెస్టారెంట్ ఏర్పాటులో కిరణ్, రిత్విక్ ల కృషి మరువలేనిది. `గోదావరి` కుటుంబంలోకి ఈ ఇద్దరు యువకులను సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. `గోదావరి` ఏర్పాటైన లొకేషన్లలోకెల్లా విశిష్టమైన రెస్టారెంట్ గా టంపాను వీరిద్దరూ నిలుపుతారన్న నమ్మకం మాకుంది.

ఈ ఏడాది ప్రథమార్థంలోనే ఇండియానాపొలిస్, మిన్నెపొలిస్, హవాయిలతో పాటు మరిన్న నగరాలకు `గోదావరి`రెస్టారెంట్లను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సంప్రదాయ దక్షిణాది వంటలతోపాటు సరికొత్త వంటకాలతో మీ ముందుకు రాబోతున్నాం (Authentic Indian food in America).

త్వ‌ర‌లోనే `గోదావ‌రి`బ్రాండ్ ను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. అమెరికాతో పాటు విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారందరికీ తెలుగు సంస్కృతీ, సంప్ర‌దాయాలు ప్ర‌తిబింబించేలా అచ్చ `తెలుగు` భోజనం, దక్షిణాది వంటకాలు, ఆతిథ్యాన్ని అందించ‌డ‌మే మా లక్ష్య‌ం.

మీ అభిప్రాయాల‌ను స్వీక‌రించేందుకు ఎల్ల‌వేళ‌లా మేం సిద్ధంగా ఉన్నాం. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మా ఎదుగుద‌ల‌కు ఎంతో ముఖ్య‌మైన‌విగా మేం భావిస్తున్నాం. మీ భావాల‌ను నిర్మొహ‌మాటంగా ఫీడ్‌బ్యాక్ రూపంలో పంచుకోండి.

'hello@godavarius.com' కు లాగిన్ అయి గోదావరి` టీంకు మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, ఫీడ్ బ్యాక్ నిర్మొహమాటంగా అందజేయండి.

ఈ వీకెండ్ లో `గోదావరి టంపా`కు వచ్చి మా వంటకాల రుచి చూసి మా ఆతిథ్యం స్వీకరించండి. ఫిబ్రవరి 29న `గ్రాండ్ ఓపెనింగ్ స్పెష‌ల్ బ‌ఫెట్`ను ఆస్వాదించండి.

కాంటాక్ట్:
గోదావరి టంపా
1251 ఈ ఫౌలెర్ అవే, టంపా, ఫ్లోరిడా 333612.
1251 E Fowler Ave, Tampa, FL 33612.

మ‌రింత స‌మాచారం కోసం దయ‌చేసి సంప్ర‌దించండి.

రిత్విక్ (Rithvik)
845-505-7278
Tampa@godavarius.com

సదామీసేవ‌లో…..

www.GodavariUS.com

Press release by: Indian Clicks, LLC

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English