ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపులు

ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపులు

ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. మద్యం అలవాటు కారణంగా కుటుంబాలు దెబ్బతింటున్నాయని.. దానివల్ల మహిళలకు కష్టాలు ఎదురవుతున్నాయన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. దేశంలోనే మరో ముఖ్యమంత్రి మాత్రం జగన్‌కు పూర్తిగా విరుద్ధమైన నిర్ణయాన్ని తీసుకుని సంచలనం రేపారు. అక్కడ మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో అక్కడి ముఖ్యమంత్రి కమల్ నాథ్ మహిళల కోసం ప్రత్యేకంగా మద్యం దుకాణాలు ఏర్పాటుచేయిస్తున్నారు. మద్యం తాగే అలవాటున్న మహిళలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట.

ఉమెన్ ఫ్రెండ్లీ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం కొనేందుకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రత్యేకంగా లేడీస్ కోసం ఏర్పాటు చేసే ఈ లిక్కర్ షాపుల్లో హై ఎండ్ ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతారు. ముందుగా భోపాల్, ఇండోర్ లో ఎక్స్ క్ల్యూజివ్ గా రెండు లిక్కర్ షాపులు.. జబల్ పూర్, గ్వాలియర్ లో చెరో లిక్కర్ షాప్ ఏర్పాటు చేయనున్నారు.

అయితే, దేశ రాజధాని దిల్లీలో ఇలా మహిళలకే ప్రత్యేకంకగా మద్యం దుకాణాలున్నాయి. కానీ, వీటిని అక్కడి ప్రభుత్వం నిర్వహించడం లేదు. షాపింగు మాల్స్‌లో ఉన్న ప్రయివేటు దుకాణాలివి.

మరోవైపు మధ్యప్రదేశ్‌లో కూడా అలాంటి ఆలోచన లేదని అక్కడి ఎక్సయిజ్ మంత్రి చెబుతున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమని.. తమ ప్రభుత్వం కొత్తగా ఫారిన్ లిక్కర్ అమ్మేందుకు ప్రత్యేక దుకాణాలు తెరుస్తోందే కానీ ఇలా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోవడం లేదంటున్నారాయన.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English