సంచలనం... సుజన చౌదరి ఆస్తుల వేలం

సంచలనం... సుజన చౌదరి ఆస్తుల వేలం

బీజేపీ (జంపింగ్) నేత, రాజ్యసభ సభ్యుడు సుజన చౌదరి ఆస్తులు వేలానికి వచ్చాయి. 400 కోట్లు అప్పు కోసం తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసి అతను చెల్లించని బాకీలను రాబట్టాలని ఆయనకు రుణం మంజూరు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ బ్రాంచ్  ( చెన్నై ) ఈ వేలం ప్రకటన ఇచ్చింది.

హైదరాబాద్ లోని వెంగళరావు నగర్‌ లో ఉన్న సుజనా చౌదరికి చెందిన ’’సుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‘‘ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సుమారు 322 కోట్లను అప్పుగా తీసుకుంది. దానికి వడ్డీలు కూడా పెరిగి అవి సుమారు 400 కోట్లకు చేరాయి. అప్పును తిరిగి చెల్లించకపోవడంతో రుణాలు రాబట్టుకోవడానికి బ్యాంక్ ఆయన తనఖా పెట్టిన ఆస్తుల వేలానికి నిర్ణయం తీసుకుంది.  

ఆస్తులు వేలం వేయడంతో పాటు ఆయనకు గ్యారంటీర్లుగా ఉన్నవారికి కూడా నోటీసులు జారీ చేసింది. సంస్థ రుణానికి సుజనా చౌదరి, వై.శివలింగ ప్రసాద్ (లేట్), వై.జితిన్ కుమార్, వై.శివరామకృష్ణ. ఎస్టీ ప్రసాద్, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్, సుజనా కేపిటల్ సర్వీసెస్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్, నియోన్ టవర్స్, సార్క్ నెట్ లిమిటెడ్ గ్యారంటీర్లుగా ఉన్నారు.  మార్చి 23న ఈ-వేలం వేస్తారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English