ప‌వ‌న్‌పై సైనికాధికారుల ప్ర‌శంస‌లు!

ప‌వ‌న్‌పై సైనికాధికారుల ప్ర‌శంస‌లు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన‌లో భాగంగా  కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. గ‌తంలో ప్ర‌క‌టించిన విధంగా అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల చెక్కును సైనికాధికారుల‌కు ప‌వ‌న్ అందజేశారు. ''ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే' సందర్భంగా సైనికులకు ఏద‌న్నా సాయం చేయాల‌ని అనుకున్నానని, గ‌తంలో ఢిల్లీ వ‌చ్చిన‌పుడు కుద‌ర‌లేదు కాబ‌ట్టి ఇప్పుడు విరాళం ఇచ్చాన‌ని ప‌వ‌న్ అన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు సైనిక బోర్డుకు తమ వంతు సాయాన్ని అందించాలని ప‌వ‌న్ పిలుపునిచ్చారు. ప‌వ‌న్ పిలుపున‌కు స్పందించిన అభిమానులు, కార్య‌క‌ర్త‌లు విరాళాలు ఇవ్వ‌డంతో పాటు, సైనికుల సంక్షేమానికి అండ‌గా నిలుస్తామన్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సైనికాధికారులు ప్ర‌శంస‌లు కురిపించారు.

కేంద్రీయ సైనిక్ బోర్డు అధికారులతో జనసేనాని చర్చ సంద‌ర్భంగా ప‌వ‌న్‌పై అధికారులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. `` సైనికుల‌కు అండ‌గా నిలిచేందుకు మీరు ఇచ్చిన పిలుపున‌కు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది.  మాకు వచ్చిన డబ్బుల కంటే  మీ ద్వారా మా బోర్డ్ గురించి జ‌రిగిన ప్ర‌చారం వెల‌క‌ట్ట‌లేనిది. మీ వీడియో చాలామందిని క‌దిలించింది, మీ పిలుపుతో సైనిక కుటుంబాలకు సహాయపడటానికి దాదాపు 10 లక్షల మంది ముందుకు వ‌చ్చారు. ఇందుకు కారణం మీరు, మీకున్న ఫాలోయింగ్. నేను విరాళం ఇస్తున్నాను....మీరు కూడా విరాళం ఇవ్వండి అంటూ మీరు ఇచ్చిన పిలుపుతో ల‌క్ష‌ల మంది  విరాళం ఇచ్చారు. మీరు చెప్పిన మాట‌కు అంత విలువుంది.  ఎంత విరాళం వ‌చ్చింద‌న్న‌ది కాదు...ఎంత‌మంది మా బోర్డ్ గురించి తెలుసుకున్నారు, సాయం చేయ‌క‌పోయినా...ఎంత‌మంది మ‌ద్ద‌తుగా నిలిచారు అన్న‌ది ముఖ్యం`` అని సైనికాధికారులు ప‌వ‌న్‌ను ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English