సైకో విలన్.. శోభన్ బాబు అవుతున్నాడు

సైకో విలన్.. శోభన్ బాబు అవుతున్నాడు

యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా వచ్చిన థ్రిల్లర్ మూవీ 'అశ్వథ్థామ'లో పెర్ఫామెన్స్ పరంగా ఎక్కువ మార్కులు అందుకుంది జిష్ణుసేన్ గుప్తా. ఈ బెంగాలీ నటుడు చేసిన సైకో విలన్ పాత్ర సినిమాలో ప్రత్యేకంగా కనిపించింది. తెలుగు ప్రేక్షకులకు అతను కొత్త అయినప్పటికీ.. విలన్ పాత్రకు ఫిట్ అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో అతడి నటన ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. నాగశౌర్య అన్నట్లు జిష్ణు సౌత్‌లో మంచి అవకాశాలే అందుకునేలా ఉన్నాడు.

ముందుగా అతను 'తలైవి' లాంటి భారీ చిత్రంలో అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాలో అతను కీలకమైన పాత్రే చేస్తున్నాడు. జయలలిత జీవిత కథతో తెరకెక్కతున్న ఈ చిత్రంలో జిష్ణు శోభన్ బాబుగా కనిపించబోతుండటం విశేషం. తెలుగులో సైకో విలన్ పాత్ర చేసిన వెంటనే.. శోభన్ బాబు లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ చేయడం విశేషమే.

జయలలితతో శోభన్ బాబుకు అధికారిక బంధం ఏమీ లేదు. కానీ వాళ్లిద్దరి మధ్య గాఢమైన ప్రేమ బంధం ఉందని అంటారు. శోభన్ బాబుతో జయ ఓ బిడ్డను కూడా కందన్న ప్రచారం కూడా ఉంది. ఆ సంగతి ఎంత వరకు నిజమన్నది పక్కన పెడితే శోభన్ బాబుతో ఆమె బంధం మాత్రం ప్రత్యేకమైంది. సినిమాలో వీళ్లిద్దరి బంధాన్ని ఎలా చూపిస్తారన్నది ఆసక్తికరం. ఒక బెంగాలీ నటుడిని శోభన్ బాబు పాత్రకు ఎంచుకోవడమూ విశేషమే. ఈ సినిమాలో జయలలితగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి కనిపించనున్నాడు.

'నాన్న' సహా కొన్ని మంచి సినిమాలు తీసిన ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తెలుగు వాడైన విష్ణు ఇందూరి 'తలైవి'ని నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది మధ్యలో సినిమా రిలీజవుతుంది. జయలలిత మీద వేరే సినిమాలు కూడా తెరకెక్కుతున్నప్పటికీ దీనిపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English