ఎన్టీఆర్ సీఎం కావడంపై పవన్ కామెంట్

ఎన్టీఆర్ సీఎం కావడంపై పవన్ కామెంట్

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఏ నాయకుడైనా ఏదో ఒక దశలో నందమూరి తారక రామారావు గురించి మాట్లాడాల్సిందే. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన అరుదైన ఘనత ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యం. దేశంలో ఎన్టీఆర్ తర్వాత ఎంతోమంది సినీ తారలు.. రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఆయనలా ఎవ్వరూ ఇలాంటి విజయం సాధించలేదు.

ఎన్టీఆర్ లాగే సీఎం కావాలని ఆశించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆయనకు దరిదాపుల్లో కూడా నిలవలేదు. ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. చిరు స్థాయిలో కూడా రాణించలేకపోయాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒక్క సీటుకు పరిమితం అయ్యాడు. తాను కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. అయితే ఈ ఫలితం పట్ల తనకు చింతేమీ లేదని అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్‌తో పోలిక గురించి పవన్ స్పందించాడు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారని.. కానీ ఆ ఘనతను ఇంకెవరూ పునరావృతం చేయలేరని స్పష్టం చేశాడు పవన్. ఆ రోజుల్లో రాజకీయ వాతావరణం భిన్నంగా ఉండేదని.. అప్పటి రాజకీయ శూన్యత, చైతన్యం ఎన్టీఆర్‌కు ఉపయోగపడిందని పవన్ అన్నాడు. ప్రస్తుత రోజుల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని.. ఇప్పుడు అత్యాశ, స్వార్థం పెరిగిపోయాయని.. ఈ రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టమని అన్నాడు పవన్.

గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోయిందని తాను భావించలేదని.. తమ పార్టీకి పడ్డ ప్రతి ఓటూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మార్పు కోసం జనాలు వేసిందని పవన్ అన్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా జనసేన పోరాటం కొనసాగుతుందని.. తాను ఏ దశలోనూ వెనుకంజ వేయనని పవన్ స్పష్టం చేశాడు. పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English