నితిన్ వాడ‌క‌మే వాడ‌క‌మ‌బ్బా..

నితిన్ వాడ‌క‌మే వాడ‌క‌మ‌బ్బా..

పెద్ద‌గా బ్యాగ్రౌండ్ లేక‌పోయినా.. డిస్ట్రిబ్యూట‌ర్ క‌మ్ ఫైనాన్షియ‌ర్ అయిన తండ్రి సుధాక‌ర్ రెడ్డి స‌పోర్టుతో హీరోగా ఎదిగిన కుర్రాడు నితిన్. వ‌రుస‌గా డ‌జ‌నుకు పైగా ఫ్లాపులొచ్చినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాడ‌త‌ను. అన్ని ఫ్లాపుల త‌ర్వాత కూడా అత‌డి క‌మ్ బ్యాక్ మూవీ ఇష్క్ ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క‌లిగించ‌గ‌ల‌గ‌డం గొప్ప విష‌య‌మే.

తాను ఎంత‌గానో ఆరాధించే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఈ సినిమా ఆడియో వేడుక‌కు ర‌ప్పించి యూత్‌లో సినిమాక‌ కొంత క్రేజ్ తీసుకురాగ‌లిగాడు. సినిమా బాగుండ‌టంతో ఇష్క్ రేంజే మారిపోయింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ ఫ్యాక్ట‌ర్‌ను సెంటిమెంటుగా మార్చుకుని దాదాపుగా ప్ర‌తి సినిమాలోనూ ప‌వ‌న్ రెఫ‌రెన్సులుండేలా చూసుకుంటున్నాడు నితిన్.

ఇష్క్ త‌ర్వాత కూడా మ‌ధ్య మ‌ధ్య‌లో ఒడుదొడుకులు ఎదుర‌వుతున్న‌ప్ప‌టికీ.. బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉన్నాడు నితిన్. అయితే గ‌త రెండు మూడేళ్లు అత‌డికి ఏమాత్రం క‌లిసి రాలేదు. చ‌ల్ మోహ‌న్ రంగ‌, ఇష్క్, శ్రీనివాస క‌ళ్యాణం తేడా కొట్టేశాయి. ఇప్పుడు అత‌డి ఆశ‌ల‌న్నీ భీష్మ మీదే ఉన్నాయి. త‌న కెరీర్‌కు కీల‌క‌మైన ఈ సినిమాను ప్ర‌మోట్ చేయ‌డానికి ఏం చేయాలో అంతా చేస్తున్నాడు నితిన్. ముందు విజేత సినిమాలో చిరంజీవిని గుర్తు చేసే ష‌ర్టుతో ఒక రెట్రో సాంగ్ చేసి జ‌నాల్లోకి వ‌దిలాడు. దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

త‌ర్వాత ప్రేమికుల దినోత్స‌వ కానుక‌గా.. ఖుషిలో దీపం సీన్‌ను అనుక‌రించే సీన్‌తో ఒక వీడియో వ‌దిలాడు. దానికీ మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఇప్పుడిక సినిమా ప్ర‌చారాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లేలా ప్రి రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా అగ్ర ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రాబోతున్నాడు. ఆయ‌న అల వైకుంఠ‌పుర‌ములో లాంటి నాన్-బాహుబ‌లి హిట్ ఇచ్చిన ఊపులో ఉన్నాడు. ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లోనే భీష్మ వేడుక కూడా జ‌ర‌గ‌బోతుండ‌టం విశేషం. మొత్తానికి హిట్టు కోసం నితిన్.. ఆలౌట్ ఎఫ‌ర్ట్ పెడుతున్న‌ట్లే ఉన్నాడు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English