చ‌నిపోయిన కూతురు క‌ళ్ల ముందు నిలిస్తే…

చ‌నిపోయిన కూతురు క‌ళ్ల ముందు నిలిస్తే…

క‌న్న బిడ్డ‌ను కోల్పోవ‌డం కంటే బాధ మ‌రొక‌టి ఈ లోకంలో మ‌రేదీ ఉండ‌దేమో పెద్ద‌గా లోకం తెలియ‌ని  వ‌య‌సులో ముద్దు ముద్దుగా మాట్లాడే చిన్నారిని కోల్పోతే ఆ బాధ‌ను భ‌రించ‌డం ఎవ‌రి వ‌ల్లా కాదు. ఐతే త‌మ‌ను విడిచి వెళ్లిన చిన్నారి మ‌ళ్లీ త‌మ ముందుకొచ్చి మాట్లాడుతుంటే.. న‌డుస్తుంటే.. ఎలా ఉంటుంది? ఆ అనుభూతి గురించి ఏమ‌ని వ‌ర్ణించాలి?

ఓ కొరియన్‌ టీవీ ఛానల్  ఈ అరుదైన దృశ్యాన్ని ఆవిష్క‌రించింది. చ‌నిపోయిన చిన్నారి రూపాన్ని వ‌ర్చువ‌ల్ రియాల్టీ ద్వారా సృష్టించి.. ఆ చిన్నారి త‌ల్లికి వీఆర్ హెడ్ సెట్ అమ‌ర్చి.. ఆమె ముందు త‌న పాప తిరుగుతున్న‌ట్లు మాట్లాడుతున్న‌ట్లు దృశ్యాన్ని ఆవిష్క‌రించారు. అప్పుడా త‌ల్లి స్పందించిన తీరుకు అక్క‌డున్న వాళ్లంద‌రూ క‌న్నీళ్లు పెట్టేసుకున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ల‌కూ క‌న్నీళ్లు ఆగ‌ట్లేదు.

ఓ కొరియన్‌ టీవీ ఛానల్‌ కొన్ని నెలల నుంచి 'మీటింగ్‌ యు' అనే పేరుతో ఒక షో నిర్వహిస్తోంది. ఈ షో ద్వారా జాంగ్‌ జీ సంగ్‌ అనే తల్లికి నాలుగేళ్ల క్రితం చనిపోయిన తన కుమార్తె నా ఇయాన్‌ను కలుసుకుని, మాట్లాడేలా దృశ్యాన్ని రూపొందించింది. ఈ షోలో జాంగ్‌ మైదానంలోకి వెళ్లగానే ఏడేళ్ల తన కుమార్తె అమ్మా అంటూ పరుగెత్తుకుంటూ వస్తున్నట్లు కనిపించింది. కన్నబిడ్డ కనబడగానే ఆ తల్లి ఒక్కసారిగా సంతోషంతో ఉబ్బితబ్బిబైపోయింది. అప్పుడా చిన్నారి తన తల్లితో..'అసలు నేను గుర్తున్నానా.. ఇంతకాలం ఎక్కడకు వెళ్లిపోవాయ్‌' అని అమాయకంగా అడగటంతో జాంగ్‌ తీవ్ర భావోద్వేగానికి గురైంది.  

'నిన్నెలా మర్చిపోతాను తల్లి' అంటూ ఏడుస్తూ బదులిచ్చింది. నిన్ను చాలా మిస్సవుతున్నాం అంటూ కూతుర్ని పట్టుకుని తల నిమిరేందుకు జాంగ్‌ ప్రయత్నించింది. అయితే యానిమేటెడ్‌ రూపంలో ఉన్న బిడ్డను ఆమె పట్టుకోలేకపోయింది. 'నిన్ను ఒక్కసారి తాకాలని ఉంది తల్లి' అని జాంగ్‌ రోదించడం చూసి అక్కడే ఉన్న ఆమె భర్త, మిగతా పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ చూసిన వాళ్లంద‌రినీ ఉద్వేగానికి గురి చేస్తోంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English