ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన: పార్టీ పెడతారా, ప్రత్యామ్నాయ కూటమా?

ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన: పార్టీ పెడతారా, ప్రత్యామ్నాయ కూటమా?

ప్రశాంత్ కిషోర్... గత ఆరేళ్లుగా రాజకీయ వర్గాల్లో బాగా నానుతున్న పేరు ఇది. 2014 ఎన్నికల్లో బీజేపీకి, గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి పని చేశారు. రెండో రోజుల క్రితం ఢిల్లీలో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా పని చేశారు. ఆయన ఏ పార్టీ కోసమైతే పని చేస్తారో ఆ పార్టీకి ఎన్నికల్లో గెలుపు ఖాయమనే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఆయన తమిళనాడులో డీఎంకేకు, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు పని చేస్తున్నారు. కర్ణాటకలో తమ గెలుపు కోసం ఆయనతో మాట్లాడుతామని జేడీఎస్ అధినేత కూడా అన్నారు.

వివిధ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోను కొనసాగారు. బీహార్‌లో జేడీయూలో చేరి, ఇటీవలే పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు. అప్పటి నుండి ఆయన భవిష్యత్తు ఏమిటనే చర్చ అందరి మదిలోను మెదులుతోంది. ఆయన రాజకీయ వ్యూహకర్తగానే వివిధ పార్టీలకు పని చేస్తారని, మరో పార్టీలో చేరుతారనే వాదనలు వినిపించాయి.

ఫిబ్రవరి 11వ తేదీ తర్వాత తాను కీలక ప్రకటన చేస్తానని గతంలో చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. ఫిబ్రవరి 11 తర్వాత తాను ఏదో కీలక ప్రకటన చేస్తానని చాలామంది ఎదురు చూశారని, వారికి నిరాశ మిగిలిందని, కానీ ఫిబ్రవరి 18వ తేదీన పెద్ద ప్రకటన చేయబోతున్నానని బాంబు పేల్చారు. బిగ్ అనౌన్స్‌మెంట్ చేస్తానని చెప్పడంతో ఆయన చేయబోయే ప్రకటన ఏమిటనే చర్చ సాగుతోంది.

ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ ఏదైనా పెడుతున్నారా? కొంతకాలంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న ఆయన ఆ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ వేదికను రూపొందించే పనిలో పడ్డారా? బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తారా? అసలు ఆయన చేసే ప్రకటన ఏమిటి అనేది అందరిలోను ఉత్కంఠ నెలకొంది. ఆయన పార్టీని ప్రకటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English