రూ.2వేల కోట్లు అవకతవకలు... ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన

రూ.2వేల కోట్లు అవకతవకలు... ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన

తెలుగు రాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిపిన సోదాలపై ఆదాయపు పన్ను శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖ, కడపతో పాటు ఢిల్లీ, పుణే తదితర 40 చోట్ల ఐటీ శాఖ సోదాలు జరిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.2వేల కోట్ల విలువైన అవకతవకలు జరిగినట్లు గుర్తించినట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు నగరాల్లో సోదాలు జరిపినట్లు పేర్కొంది. ఈ సోదాల్లో కీలక పత్రాలు లభించినట్లు తెలిపింది.

మూడు ఇన్ఫ్రా కంపెనీలలో నకిలీ బిల్లులను గుర్తించామని, లెక్కచూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల విలువైన ఆభరణాలు తమ సోదాల్లో గుర్తించినట్లు తెలిపింది. బోగస్ సబ్ కాంట్రాక్టర్ల ద్వారా భారీగా అక్రమ లావాదేవీలు గుట్టురట్టు చేసినట్లు తెలిపింది. బోగస్ బిల్లులు, అధిక రేట్లపై ఇన్వాయిస్‌ల ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామని తెలిపింది.

కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ మెయిల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా జరిపిన ట్రాన్సాక్షన్స్‌ను, విదేశీ ట్రాన్సాక్షన్స్‌ను గుర్తించినట్లు తెలియజేసింది. ఒ ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై జరిపిన దాడిలో ఈ అవకతవకలు బయటపడినట్లు పేర్కొంది. ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు పత్రాలు సృష్టించి, అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.2వేల కోట్లు చేతులు మారినట్లుగా భావిస్తున్నట్లు తెలిపింది. పన్ను లెక్కలకు దొరకకుండా రూ.2 కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధులను దారి మళ్లించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ప్రధాన కార్పోరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుండి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించారు.

గ్రూప్ కంపెనీలకు కోట్లాది రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు కూడా వచ్చినట్లు గుర్తించారు. రూ.85 లక్షల అక్రమ నగదు, రూ.75 లక్షల నగలు, రూ.25 బ్యాంకు లాకర్లు సీజ్ చేశారు ఐటీ అధికారులు. కాగా, ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English