వలస పక్షులతో అలసట లేదు...!

వలస పక్షులతో అలసట లేదు...!

దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి వంటి నాయకులెంతోమంది టీడీపీని వీడి వేరు వేరు పార్టీల్లో చేరారు. మూడు దశాబ్దాలుగా తమను ఆదరించిన పార్టీ ని కాదనుకుని వారు కొత్త వారివైపు ఆకర్షితులయ్యారు. ఇదే సమయంలో వారు చంద్రబాబును ఎంతగా నిందించాలో అంతగానూ నిందించారు. టీడీపీని కూడా నానా మాటలూ అన్నారు.

అయితే వారు తెలుగుదేశాన్ని దాటి దాదాపుగా నెల కావొస్తోంది! మరి ఇప్పుడు వారిని కోల్పోయిన టీడీపీలో  లోటు ఏమిటి? వారిని తమ పార్టీల్లోకి చేర్చుకున్న వారు బాగుపడినది ఏమిటి? అనే విషయాలను విశ్లేషిస్తే... ఈ నాయకులు పార్టీని వీడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఘనంగా మహానాడు కార్యక్రమం నిర్వహించుకుంది.  ఆ కార్యక్రమంలో  ఎంత గ్రాండ్ గా జరిగిందో...అంతే మంది యువనేతలు పార్టీ వెలుగులోకి వచ్చారు. వారి తండ్రులు పార్టీ నాయకులే అయినా... ఈ యువ నాయకత్వం పార్టీలో కొత్త రక్తం నింపుతుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు. మహానాడు వేదికగానే దాదాపు పది నుంచి పదిహేను మంది యూత్ సోల్జర్స్ తెలుగుదేశం పతాకాన్ని ధరించారు.

నిజానికి ఈ మధ్య కాలంలో తెలుగుదేశం అమితంగా ఆనంద పడాల్సిన సందర్భం ఏదైనా ఉందంటే...అది మహానాడు. ఇద్దరు ముగ్గురు నేతలు పార్టీని వీడిపోతానే  తెలుగుదేశం పని ఖాళీ అయ్యిందని వ్యాఖ్యానించిన విశ్లేషకులకు, మీడియా వ్యాఖ్యాతలకు ఇది చెంప పెట్టు. ఇక తెలుగుదేశం నుంచి బయలకు వెళ్లి పోయిన ముసలి నాయకులను చేర్చుకున్న వారికి దక్కే ప్రయోజనాలు ఏమిటో కూడా ఇక్కడ చర్చించుకోవచ్చు! అటు పార్టీని వీడి కొత్త పార్టీలో చేరిన నేతలు, చేర్చుకున్న పార్టీలు ప్రజల మధ్యలో విశ్వసనీయత కోల్పోయే అవకాశం ఉంది. ఇన్ని రోజులూ తాము తిట్టిన పార్టీల్లోకి చేరి ఆ నాయకులు, తమను తిట్టిన వారిన చేర్చుకున్న ఆ పార్టీలూ రెండూ పలచన అవుతున్నాయి. ఇలా తెలుగుదేశం నుంచి వలసల వళ్లా ఆ పార్టీకి ఏ నష్టం జరగనూ లేదు, ఈ వలస పక్షలు వాలిన చెట్లు లాభపడనూ లేదు!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు