రాముడిపై వ్యాఖ్యలు.. కత్తి మహేష్ బుక్కయ్యాడు

రాముడిపై వ్యాఖ్యలు.. కత్తి మహేష్ బుక్కయ్యాడు

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలిచి క్రిటిక్ కమ్ సోషల్ యాక్టివిస్ట్.. మరోసారి ఓ కేసులో ఇరుక్కున్నాడు. రాముడు తన అంత:పురంలో ఉంపుడుగత్తెలతో సుఖించేవాడని.. ఆయనకు నెమలి తొడ అంటే ఇష్టమని.. సీత జింకను వండుకుని తినడం కోసమే ఆయన్ని అడవిలోకి పంపిందని వెకిలిగా మాట్లాడుతూ ఓ సభలో కత్తి మహేష్ శ్రుతి మించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2018లోనూ రాముడు, సీత గురించి కత్తి మహేష్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. అప్పుడు కూడా కేసు బుక్ అయింది. దాన్నుంచి ఎలాగోలా బయటపడ్డాడు. ఐతే ఈసారి అతను మరీ శ్రుతి మించి మాట్లాడాడు.

రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన సమావేశంలో కత్తి మహేష్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒక మతాన్ని కించపరిచేలా.. ఒక వర్గానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేయకూడదన్న రాజ్యాంగ సూత్రాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించిన సమావేశంలో కత్తి మహేష్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. లిబరల్స్‌గా, మేధావులుగా పేరున్న చాలామంది హిందూ మతం మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మామూలే. వాళ్లు మరో మతంలోని తప్పులు, అరాచక సంప్రదాయాల గురించి మాత్రం ఎప్పుడూ నోరెత్తరు.

హైదరాబాద్‌కు చెందిన ఉమేష్ కుమార్ అనే వ్యక్తి కత్తి మహేష్ మీద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పిటిషన్లో మహేష్ వ్యాఖ్యల తాలూకు వీడియో లింక్ కూడా ఇచ్చాడు. మరి పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English