పవన్ గాలి తీసే పంచ్ వేసిన ఆలీ?

పవన్ గాలి తీసే పంచ్ వేసిన ఆలీ?

దరిద్రపుగొట్టు రాజకీయాలని ఊరికే అనరేమో? చక్కగా ఉండే కుటుంబాల్ని.. బంధుమిత్రుల్ని సైతం రగిలిపోయేలా చేసే శక్తి రాజకీయానికి ఉందని చెప్పాలి. రాజకీయంగా విభేదాలు మొదలైతే అవి ఎక్కడికో వెళ్లిపోతాయి. అప్పటివరకూ ఉన్న అనుబంధాలు మరేమీ గుర్తుకు రావు. తాజాగా స్టార్ కమెడియన్.. సీనియర్ నటుడు అలీ అలాంటి తీరునే ప్రదర్శించారని చెప్పాలి.

తాజాగా విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో హాజరైన ఆయన కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా లచ్చిమీ డోంట్ టచ్ మీ.. బాగున్నారా బాగున్నారా? అంటూ తన మార్క్ డైలాగుల్ని చెప్పిన అలీ సభికుల్ని అలరించారు. వచ్చామా? వెళ్లామా? అన్నట్లు కాకుండా అవసరం లేకున్నా.. పవన్ ను ఉద్దేశించినట్లుగా పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

విశాఖ ప్రజలు తెలివైనోళ్లు అని.. ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి బాగా తెలుసంటూ వేసిన పంచ్ కచ్ఛితంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించే అయి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలీ చేసిన వ్యాఖ్యల్లో అర్థం చేసుకోలేనంత ఏమీ లేదన్న మాట వినిపిస్తోంది. కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో విశాఖలోని గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయటం.. ఓటమి పాలు కావటం తెలిసిందే. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు.

ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అలీ మాటలు ఉన్నాయని చెబుతున్నారు. పవన్.. అలీ మధ్య ఉన్న స్నేహబంధం అందరికి తెలిసిందే. కారణాలు ఏమైనా.. జనసేనలో కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో ఇరువురి మధ్య గ్యాప్ పెరిగింది. ఇదే క్రమంలో అలీ ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ స్పందించటం.. దానికి అలీ కౌంటర్ ఇవ్వటం లాంటి మాటలు వారి మధ్య దూరాన్ని మరింత పెంచినట్లు చెబుతారు.

తన సినిమాల్లో అవసరం ఉన్నా.. లేకున్నా ఏదో ఒక పాత్రలో అలీని నటించేలా చేయటం పవన్ కు అలవాటు. అంతటి అభిమానం సైతం రాజకీయంగా వచ్చిన వైరంతో ఒకరిపై ఒకరు మాటలు అనుకునే పరిస్థితి. ఇదిలా ఉంటే.. గడిచిన కొద్ది రోజులుగా ఒకరిని ఉద్దేశించి ఒకరు ఎలాంటి వ్యాఖ్యలు చేసుకున్నది లేదు. ఇలాంటివేళలో పవన్ ను గుర్తుకు తెచ్చేలా అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English