క‌న్నాకు ఎస‌రు పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌?

క‌న్నాకు ఎస‌రు పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌?

ఏపీలో బీజేపీకి పెద్ద‌గా క్యాడ‌ర్ లేద‌న్న సంగ‌తి తెలిసిందే. ఉన్న కొద్దిపాటి క్యాడ‌ర్‌ను న‌డిపించే బ‌ల‌మైన లీడ‌ర్ కూడా లేడ‌ని ప్ర‌ధాన పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటాయి. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా నియ‌మితుడైన సీనియ‌ర్ పొలిటిషియ‌న్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పెద్ద‌గా రాణించ‌లేద‌ని అధిష్టానం భావ‌న‌. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌న్నా ఆధ్వ‌ర్యంలో బీజేపీ ఒక్క అసెంబ్లీ, పార్ల‌మెంటు స్థానంలోనూ విజ‌యం సాధించ‌లేక‌పోయింది. జీవీఎల్ వంటి నేత‌ల‌తో క‌న్నాకు స‌ఖ్య‌త లేద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే క‌న్నాకు ప్ర‌త్యామ్నాయం కోసం బీజేపీ అధిష్టానం ఎదురు చూస్తోంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీజేపీతో ప‌వ‌న్ పొత్తుపెట్టుకోవ‌డంతో...క‌న్నా ప‌ద‌వికి ప‌వ‌న్ ఎస‌రు పెట్టాడ‌ని వ‌దంతులు వినిపిస్తున్నాయి.

బీజేపీతో జ‌న‌సేన పొత్తు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీ బీజేపీకి ప‌వ‌న్ అన‌ధికారిక అధ్య‌క్షుడయ్యార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కున్న ఫాలోయింగ్,క‌రిష్మాను బీజేపీ క్యాష్ చేసుకోవాల‌ని చూస్తోందట‌. ప‌వ‌న్ అంగీక‌రిస్తే...బీజేపీలో జ‌న‌సేన విలీనం చేసి.....ప‌వ‌న్‌ను బీజేపీ రాష్ట్రాధ్య‌క్షుడిగా నియ‌మించే యోచ‌న‌లో బీజేపీ పెద్ద‌లున్నార‌ట‌. అయితే, 2024 ఎన్నిక‌ల వ‌ర‌కు విలీనానికి మొగ్గు చూప‌ని ప‌వ‌న్... ప్రస్తుతానికి పొత్తుకు మాత్ర‌మే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో, ప‌వ‌న్ అన‌ధికారికంగా బీజేపీ అధ్య‌క్షుడిగా చ‌లామణీ కాబోతున్నార‌ట‌. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక ఎన్నిక‌ల్లోనూ బీజేపీ-జ‌న‌సేన‌ల ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను ప‌వ‌న్ భుజ‌స్కంధాల‌పై మోయ‌బోతున్నార‌ట‌. అయితే, ప‌వ‌న్ రాక‌తో త‌న‌కు ఇబ్బందేమీ లేద‌ని క‌న్నా భావిస్తున్నార‌ట‌. ఏది ఏమైనా, ప‌వ‌న్ రాక‌తో క‌న్నాకు చిక్కులు త‌ప్ప‌వ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English