కాంగ్రెస్, బిజేపిల సీమాంధ్ర సారథులు వీరేనా

కాంగ్రెస్, బిజేపిల సీమాంధ్ర సారథులు వీరేనా

కాంగ్రెస్, బిజేపిలు సీమాంద్రకు ప్రచారసారథులను నియమించిందా?అధికారికంగా ప్రకటించకున్నా కూడా తాజా పరిస్థితులు చూస్తుంటే ఆ రెండు పార్టీలు వారి సారథులను సీమాంద్రలోకి దించారన్న అన్న విషయం స్పష్టం అవుతోంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రకటన నేపథ్యంలో కాంగ్రెస్ కు సీమాంద్రలో సారథి మాట అటుంచి పార్టీని ముందుండి నడిపించే సరైన నాయకుడు లేకుండా పోయాడన్నది నిజం. అందుకే కిరణ్ స్థానంలో మరో ముఖ్యమంత్రిని నియమించుకోలేక తన ప్రభుత్వం ఉన్న చోటే రాష్ట్రపతి పాలన విధించుకోవాల్సి వచ్చింది. బిజేపికి ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తానికే ఓ అధ్యక్షుడు ఉన్నారు.

ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో సీమాంద్రకు ఒక సారథిని నియమించుకోవాల్సిందే. అయితే అది ఇంకా సీమాంద్ర రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయకున్నా కూడా సీమాంద్రకు హీరో కోసం ముందుగానే వ్యూహం రచించి ఆ దిశగా అడుగులు వేసింది. రాజ్యసభలో సీమాంద్రకు చెందిన వెంకయ్యనాయుడుతో ఓ ఆట ఆడించి ఆయనను సీమాంద్రలో పాపులర్ చేయించుకుంది. వెంటనే ఆయనను సీమాంద్రలో పార్టీ పట్టు పెంచుకునేందుకు రంగంలోకి దించింది. అలా ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిందో లేదో ఇలా వెంకయ్య సీమాంద్రలో వాలిపోయి తానే లేకపోతే సీమాంద్రకు మరింత అన్యాయం జరిగేదంటూ తన ప్రమోషన్ తో పాటు పార్టీ ప్రమోషన్ వర్క్ ప్రారంభించారు.

దీంతో బెంబేలెత్తిపోయిన కాంగ్రెస్ కు వెంకయ్యను మాటల్లో ధీటుగా ఎదుర్కునేంత నాయకుడు సీమాంద్రలో లేకపోవడంతో వెంటనే ఆ భాద్యతను కేంద్ర మంత్రి, మంత్రుల బృందంలో కీలక సభ్యుడు జైరాంరమేష్ ను రంగంలోకి దించింది. ఆయన వెంటనే ఇక్కడ వాలి వెంకయ్యనాయుడు మాటలకు కౌంటర్ ఇస్తూ సీమాంద్రకు చేసిన, చేయబోయే పనులను హామీలుగా కురిపిస్తూ ముందుకు పోతున్నారు. అంతే కాదు సీమాంద్రలో పట్టు సంపాదించాలంటే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడాలి, ఆయన వచ్చీ రాగానే టిఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చి తాను సీమాంద్రకు న్యాయం చేయడం కోసమే వచ్చాను అన్నట్లుగా మాట్లాడడం మొదలు పెట్టారు. దీంతో కాంగ్రెస్ జైరాంరమేష్ ను సీమాంద్రలో ప్రచార సారథిగానో, లేక భవిష్యత్ అధిపతిగానో ఎంపిక చేసుకుందా అన్న అనుమానాలయితే కలుగుతున్నాయి.

కారణం ఆయన మాట్లాడుతున్న ప్రతిమాట సీమాంద్రకు ఫేవర్ గానే ఉంటోంది. పనిలో పనిగా వెంకయ్యనాయుడు చెబుతున్న ప్రతివిషయాన్ని ఖండిస్తున్నారు. మాటకు మాట జవాబిస్తున్నారు. వెంకయ్యనాయుడు కూడా జైరాంరమేష్ మాటలను తిప్పికొడతున్నారు. ఇలా ఆ ఇద్దరి నేతల మద్య సీమాంధ్రలో పట్టుకోసమే యుద్దం జరుగుతోంది అన్నట్టు క్లియర్ గా కనిపిస్తోంది. ప్రత్యేక ప్రతిపత్తి తామే కల్పించామని, తాము అడగకపోతే కాంగ్రెస్ ఇచ్చేది కాదని, ఇంత మంది సీమాంద్ర మంత్రులుండి చేయలేని పని రాజ్యసభలో తాము చేసామని వెంకయ్య అంటే అదేం లేదు, తామే ఆ పని చేసామని, స్వయం ప్రతిపత్తి ఏడు జిల్లాలకే అని జైరాంరమేష్ ఇలా వెంకయ్య, జైరాంరమేష్ లు పోటాపోటీగా సీమాంద్రలో దూసుకుపోవడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తే మాత్రం వీరిద్దరే వారి పార్టీల సీమాంద్ర సారథులన్న భావం మాత్రం ఇప్పటికిప్పుడు కలుగుతోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English