ఏపీలో మ‌ళ్లీ అదే సీన్‌.. సినిమా ధియేట‌ర్ల మూత‌

రాష్ట్రంలోని సినిమా థియేటర్లపై ప్ర‌భుత్వం క‌త్తిక‌ట్టింది. మరోమాట‌లో చెప్పాలంటే.. ప్ర‌భుత్వ‌మే రాజ‌కీయ వ్యూహంలో భాగంగా క‌క్ష‌క‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోందని అనుకోవ‌చ్చు.  ఎక్క‌డికక్క‌డ రెవెన్యూ అధికారులు ఆంక్షలు విధించడంతో భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శనకు అడ్డంకులు ఏర్పడ్డాయి. విస్సన్నపేటలోని ఓ థియేటర్లో టికెట్ ధర రూ. 35 చొప్పున ఆడించలేమంటూ యాజమాన్యం చేతులెత్తేశారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

కృష్ణా జిల్లాలోని పలు థియేటర్లలో భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శనకు అడ్డంకులు ఏర్పడ్డాయి. సినిమా ప్రదర్శనపై రెవెన్యూ అధికారులు ఆంక్షలు విధించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్సన్నపేటలోని ఓ థియేటర్లో టికెట్ రూ. 35 చొప్పున ఆడించలేమంటూ థియేటర్ యాజమాన్యం చేతులెత్తేయడంతో ఆందోళన చేపట్టారు.

ఇలా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఇలానే ఉండ‌డంతో  సినిమా ప్రదర్శించాలంటూ థియేటర్ల ముందు పవన్ కల్యాణ్ అభిమానులు బారులు తీరారు. విస్సన్నపేట తిరువూరు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో దాదాపు అరగంట పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

మైలవరంలో భీమ్ల నాయక్ చిత్ర ప్రదర్శనను సంఘమిత్ర థియేటర్ యాజమాన్యం నిలిపివేసింది. తగ్గించిన టికెట్ ధరలతో నడపలేమని నిర్వాహకులు గేటుకు నోటీసులు అంటించారు. వాస్త‌వానికి పొరుగు రాష్ట్రంలో రూ.150 కి పైమాటే ఈ టికెట్ ధ‌ర‌లు విక్ర‌యించుకునేందుకు అవకాశం క‌ల్పించారు. కానీ, ఇక్క‌డ మాత్రం ప్ర‌భుత్వం ఇంకా సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. దీని వెనుక రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.