అధికారులకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ

అధికారులకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పాలక వైసీపీ దూకుడు మీదుందన్న సంగతి అందరికీ తెలిసిందే. వైసీపీ దూకుడు చూసి ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు దగ్గరగా ఉండే అధికారులు కూడా మంచి దూకుడు మీదున్నారు. ఈ దూకుడు కారణంగా టీడీపీ అడుగడుగునా ఇబ్బందులు పడుతోంది. దీంతో టీడీపీ నేతలు ఇప్పుడు వైసీపీ నాయకుల కంటే ముందు అధికారులను కంట్రోల్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.

ఆ క్రమంలోనే అధికారులకు వార్నింగులు ఇవ్వడం ప్రారంభించారు. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రివెంజ్ తీర్చుకుంటామన్నారు.

టీడీపీ నాయకులు, ఆ పార్టీకి మద్దతుగా నిలిచే వారిపై కేసులు బనాయిస్తున్న ఘటనలపై ఆ పార్టీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే ‘రివెంజ్’ తీర్చుకోవడమే తమ లక్ష్యమని, తమ మొదటి ప్రాధాన్యత ‘రివెంజ్’ అని, రెండో ప్రాధాన్యత ‘అభివృద్ధి’ అని చెప్పారు.

ఇప్పుడు తమపై నాలుగు కేసులు బనాయిస్తే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పది కేసులు పెడతామని హెచ్చరించారు. మన దమ్ము ఏంటో ఈసారి చూపిద్దామని, టీడీపీ అధికారంలోకి వస్తే ఎంతటి అధికారినైనా వదిలే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇతర జిల్లాల్లోనూ పలువురు టీడీపీ నేతలు అధికారులకు ఇలాంటి హెచ్చరికలే చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English