లోకేష్‌కు పిచ్చి... హద్దులు దాటుతున్న వంశీ మాటలు

లోకేష్‌కు పిచ్చి... హద్దులు దాటుతున్న వంశీ మాటలు

ప్ర‌జాక్షేత్రంలో కంటే....ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా స్పందించే టీడీపీ యువనేత నారా లోకేష్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేస్తుంటారు. పార్టీ త‌ర‌ఫున గ‌లం వినిపించే లోకేష్ ఈ విష‌యంలో ప‌లు సంద‌ర్భాల్లో ఇర‌కాటంలో కూడా ప‌డిపోతుంటారు. తాజాగా అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఏపీలోని రాజ‌కీయ ప‌రిణామాలు, మండ‌లి ర‌ద్దు త‌దిత‌ర అంశాల నేప‌థ్యంలో...టీడీపీ ఎమ్మెల్యేలను సంతలో గొర్రెల్లాగా కొన్నారంటూ వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, పోతుల సునీత.. తదితరుల ఫోటోలతో ఉన్న వీడియోను లోకేష్ పోస్ట్ చేశారు. అయితే, దానిపై వంశీ ఓ రేంజ్‌లో రియాక్ట‌య్యారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో... వైసీపీ ఎమ్మెల్యేల టీడీపీలో చేర్చుకున్న సంగ‌తి  తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స్పందిస్తూ సంతలో గొర్రెల్లాగా తమ ఎమ్మెల్యేలను కొన్నార‌ని ఆరోపించారు. అయితే, తాజాగా కొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేర‌క‌పోయిన‌ప్ప‌టికీ, ఆ పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. టీడీపీ పెద్ద‌ల‌తో విబేధించారు. అయితే, ఈ రెంటికి ముడిపెట్టిన లోకేష్‌... జ‌గ‌న్ గ‌తంలో చేసిన కామెంట్ల‌ను ప్రస్తావిస్తూ వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, పోతుల సునీత ఫోటోలను జత చేశారు. గొర్రెలతోపాటు గొర్రెల డాక్టర్‌నూ కొన్నారంటూ లోకేష్ కామెంట్ చేశారు. స‌హ‌జంగానే తెలుగుదేశం పార్టీ నేత‌లు ఈ ట్వీట్‌ను స‌మ‌ర్థించారు.

అయితే, తెలుగుదేశం పార్టీ గుడివాడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం ఓ రేంజ్‌లో రియాక్ట‌య్యారు. వద్దంటే వెళ్లి మంగళగిరిలో పోటి చేసి చిత్తుగా ఓడారని లోకేష్‌పై సెటైర్లు వేశారు. అప్పుడు ఓట‌మి... ఇప్పుడు మండలి కూడా రద్దు కావడంతో లోకేష్‌కు పిచ్చిపట్టి కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాక.. గొర్రెలకే కాదు.. పిచ్చికుక్కలకూ తన దగ్గర వైద్యముందని వంశీ విరుచుకుప‌డ్డారు. వంశీ కామెంట్ల‌కు టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English