మండ‌లి ర‌ద్దు కాలేదు..అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మండ‌లి ర‌ద్దు కాలేదు..అంబ‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపిన సంగ‌తి తెలిసిందే. మూడింట రెండొంతులకు పైగా మెజార్టీతో సభ ఆమోదం తెలిపడంతో మండలి రద్దు తీర్మానం శాసన సభ ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే, ఇంకా మండలి రద్దు కాలేద‌ని వ్యాఖ్యానించారు వైసీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు.

మండలి ర‌ద్దుపై స్పందించిన అంబ‌టి రాంబాబు శాసనమండలిలో మేధావులు చాలా మందే వున్నా.. నారా లోకేశ్ లాంటి వారు చేరి పెద్దల సభను భ్రష్టు పట్టించారని మండిప‌డ్డారు. మండలి రద్దుకు చంద్రబాబు వైఖ‌రి ప్రధాన కారణమన్నారు. ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేల బలంతో ఏర్పాటైన పూర్తి మెజార్టీ ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో 133 మంది సభ్యుల బలంతో మండలి రద్దు తీర్మానం ఆమోదించిందని చెప్పారు. అయితే, పార్లమెంటు ఆమోదం తెలిపి.. దానికి రాష్ట్రపతి రాజముద్ర వేసే వరకు శాసనమండలి మనుగడలోనే వుంటుందని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో జ‌రిగిన ప‌లు ఉదంతాల‌ను అంబ‌టి రాంబాబు వివ‌రించారు. దివంగ‌తఎన్టీఆర్ హయాంలో శాసనమండలిని రద్దు చేస్తూ  1984 మార్చిలో  అసెంబ్లీలో తీర్మానం చేశారని, అది 1985 మే 31న పార్లమెంటు ఆమోదంతో రద్దయ్యిందని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో కౌన్సిల్ పునరుద్దరణకు ప్రయ్నత్నం చేసినా పునరుద్ధరించడంలో ఆయన విఫలమయ్యారని అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన అనంత‌రం 2004 జూలై 8న శాసన మండలి పునరుద్దరణకు తీర్మానం చేయగా.. 2007 జనవరిలో మండలి తిరిగి ఏర్పాటైందన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English